కొడుక్కి దారి ఇచ్చి తప్పుకోవాలని నిర్ణయించుకున్న నాగార్జున
కొడుకుతో పోటీ పడటం ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ నాగార్జున తన తాజా చిత్రం రాజన్న రిలీజ్ డేట్ మార్చుకోవాలి నిర్ణయించుకున్నాడు. నాగచైతన్య, అజయ్ భుయాన్ కాంబినేషన్ లో రెడి అవుతున్న దడ చిత్రం కూడా ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ కావటానికి పూర్తి కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందులోనూ ఈ రెండు చిత్రాలు తమ హోమ్ బ్యానర్ లోనే కావటం నాగార్జునకి కలిసి వచ్చింది. ఇక రాజన్న చిత్రం పాట మినహా షూటింగ్ పుర్తైపోయింది. దడ చిత్రం విషయానికి వస్తే పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది.
రాజన్న చిత్రాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి యాక్షన్ సీన్స్ ని రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. మరో ప్రక్క దడ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు. రొమాంటిక్ హీరోగా ముందుకు వెళ్తున్న నాగచైతన్యకి ఈ చిత్రం యాక్షన్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెడుతుందనే నమ్మకంగా ఉన్నారు. దాంతో తన కెరిర్ కన్నా కొడుకు కెరీర్ ముఖ్యమనుకున్న నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.దడ విడుదలైన ఓ నెల రోజుల గ్యాప్ తో రాజన్న విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











