నిర్మాతను మోసగించిన రాజశేఖర్!?
హీరో రాజశేఖర్ ఒక మూడిస్ట్. అతను ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో కూడా ఎవ్వరూ ఊహించలేరు. సినిమాల విషయంలో కూడా అంతే. ఒక్కసారి చేస్తానంటాడు, మరొక సారి చేయనంటాడు. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన లక్ష్మీ గణపతి ఫిలింస్ సుబ్రమణ్యంకి కూడా రాజశేఖర్ అలానే చేసాడట. అతను ఓ తమిళ చిత్రాన్ని అనువదించాలని ప్రయత్నిస్తుండగా, దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని వాకాడ అప్పారావు అన్నాడట. రాజశేఖర్ హీరోగా చేస్తానని చెప్పాడట.
కానీ అతను ఆ మాట ఇచ్చిన తర్వాత నెల రోజులకి ఈ సినిమా చేయనని కబురు పంపించి షాక్ ఇచ్చాడట. దాంతో సుబ్రమణ్యం సమయం వృధా అవ్వటమే కాకుండా ఎలాగూ రీమేక్ చేస్తున్నాం కదా అని డబ్బింగ్ ఆలోచనని కూడా విరమించుకున్నాడు. రాజశేఖర్ హ్యండిచ్చిన తర్వాత ఆ చిత్రాన్ని (సేనాధిపతి)అనువదించి విడుదల చేసానని సుబ్రమణ్యం అంటున్నాడు.
రాజశేఖర్ జీవిత నా స్టైలే వేరు భూమిక సేనాధిపతి సుబ్రమణ్యం వాకాడ అప్పారావు rajasekhar jeevitha naa style ey veru bhoomika subramanyam vakada apparao senadhipati


Click it and Unblock the Notifications