చిరంజీవికి పోటీగా నేనుసైతం అంటున్న రాజశేఖర్
రాజశేఖర్, జీవిత దంపతులు మెగాస్టార్ చిరంజీవి మీద వీలు చిక్కినప్పుడల్లా మండిపడుతుంటారు. ఆయనకు పోటీగా మేము సైతం అంటూ సామాజిక సేవకు నడుంకట్టారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరదబాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు.
తమ ట్రస్టు ద్వారా పెబ్బేరు ప్రాంతంలోని ఎనిమిది వేల మంది వరదబాధితులకు 7 లక్షల రూపాయల ఖర్చుతో సహాయం చెయ్యడానికి ప్రణాళికలు పూర్తి చేసారు. తాము ఓ ట్రస్టు నడుపుతున్నామని, దాని గురించి పబ్లిసిటీ తమకు అక్కరలేదని పరోక్షంగా చిరుని దెప్పిపొడిచిన వీరు ఇప్పుడు చేస్తున్నది చిరు మీద పోటీగానే అయినా మంచి పని చేస్తున్నారని పలువురు అభినందిస్తున్నా...ఎవరి మీదో వున్న కోపంతో ఈ పని చేయడం కన్నా ప్రజల మీద వున్న ప్రేమతో చేసుంటే బాగుండేది అని కొందరంటున్నారు. అయినా వారు కోపంతో చేస్తున్నారో, ప్రేమతో చేస్తున్నారో జీవిత, రాజశేఖర్ లకే తెలియాలి. కానీ మంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటి సంకోచాలు అవసరం లేదనేది అందురూ తెలుసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications











