కూతురును ఏ చేద్దాం?, జీవిత-రాజశేఖర్ గొడవ

By Bojja Kumar

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సీనీజంట జీవిత-రాజశేఖర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిరంజీవి విషయంలో, జగన్ విషయంలో వీరు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కొన్ని రోజులైతే వరుసగా చిరంజీవిని తిట్టి పోయడమే పనిగా పెట్టుకున్నారు. అల్లు అరవింద్ వీరిపై పరువు నష్టం దావా వేయడానికి తోడు, చిరంజీవి అధికార పార్టీ కాంగ్రెసులో చేరడంతో ఇప్పడు కాస్త తగ్గారు కానీ...లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదోమో?

ఆ సంగతి పక్కన పెడితే ఇప్పడు ఈ జంట సరికొత్త వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. అది కూడా ఇంటి పోరుతో. ఎప్పుడు ఒకరిని విడవకుండా ఒకరు, గంతకు తగ్గబొంతలా భలే చూడ ముచ్చటగా ఉండే ఈ జంట గొడవ పడటం ఏమిటీ అని అశ్యర్యం వేస్తుంది కదూ. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. జీవితరాజశేఖర్ ఇరుగు పొరుగు వారి నుంచి అందిన సమాచారం ప్రకారం ఇద్దరూ రోజూ ఇంట్లో గొడవ పడుతున్నారట. అదీ కూడా తమ పెద్ద కూతురు శివాని విషయంలో. జీవిత శివానిని హీరోయిన్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందట. స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తీసేందుకు ఇప్పటి నుంచి ప్రణాళిక తయారు చేసుకుంటుందట. అయితే రాజశేఖర్ కు మాత్రం తన కూతురు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంచాలని వాదిస్తున్నాడట.

అయితే సాధారణంగానే భర్తపై ఆధితప్యం చెలాయించే జీవిత...రాజశేఖర్ అభిప్రాయాన్ని ఖాతరు చేయడం లేదని, అందుకే ఈగొడవలు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. ఏది ఏదైతేనేం టిక్కెట్టు గట్రా లేకుండా వీళ్ల గొడవను ఫ్రీగా చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఇరుగు పొరుగువారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X