రామ్ చరణ్ సినిమాలో రాజశేఖర్?
రామ్ చరణ్, వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజశేఖర్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు రూమర్స్ గత రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇది విన్న వారు మాత్రం ఇది జరిగేపని మాత్రం కాదు అని కొట్టిపారేస్తున్నారు.చిరుకీ,రాజశేఖర్ కి వైరం సంగతి తెలిసిందే అయినా దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు రాజశేఖర్ ఒప్పుకున్నట్లు చెప్తున్నారు.అంతేగాక రాజశేఖర్ ఇప్పుడు మహంకాళి అనే చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఆ చిత్రం తర్వాత ఆయన చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఎంత గొప్ప పాత్ర అయినా హీరోగా చేస్తున్నవాడు వదులుకుని నెగిటివ్ రోల్ ఎందుకు చేస్తాడని లాజిక్ తీస్తున్నారు అభిమానులు. ఇక రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











