రాజశేఖర్ మళ్లీ మొదలెట్టాడు...
హైదరాబాద్: ఆ మధ్యన వరస రీమేక్ లతో బాదేసిన రాజశేఖర్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ మరో రీమేక్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ సారి తమిళంలో విజయవంతమైన Saattai(2012) చిత్రం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అక్కడ సముద్ర ఖని ఈ చిత్రంలో హీరోగా చేసారు. చిత్రానికి అవార్డులు సైతం వచ్చాయి.
ఇఖ ఆ చిత్రంలో సముద్రఖని ఓ స్కూల్ టీచర్ గా కనిపించారు. తమిళంలో డైరక్ట్ చేసిన Anbazhagan...తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని రాజశేఖర్ సొంత బ్యానర్ పైనే రూపొందిస్తున్నట్లు వినికిడి. మిగతా నటీనటులు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పై పోరాడి,మార్పు తెచ్చే పాత్ర ఇది. ఇక్కడ తెలుగుకి కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇక వరస ప్లాపుల్లో ఉన్న రాజశేఖర్ ఈ చిత్రంతో ఒడ్డెక్కుతారని భావిస్తున్నారు. ఎంతో నమ్మకం పెట్టుకుని తనకు ఇష్టమైన పోలీస్ పాత్ర చేసిన మహంకాళి చిత్రం సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో రాజశేఖర్ ఏ తరహా పాత్రలు చెయ్యాలనే డైలమోలో ఉండి దీన్ని ఓకే చేసారు.


Click it and Unblock the Notifications












