బాలయ్య బాబు సినిమా కోసం రాజశేఖర్.. ట్విస్ట్ ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నందమూరి బాలకృష్ణ మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు తగ్గట్టుగా సరైన కథను కూడా ఏ దర్శకుడు సిద్ధం చేయలేకపోతున్నాడు. అయితే రాబోయే సినిమాల్లో మాత్రం ఒక ప్రముఖ హీరో ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు రాజశేఖర్ అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఆ పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఏమిటో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరొక మాస్ సినిమా

మరొక మాస్ సినిమా

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత పూర్తి స్థాయిలో ఫాంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు వరుస అపజయాలతో కాస్త అభిమానులను నిరాశపరిచిన బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అఖండ సినిమా అనంతరం కూడా అంతకు మించి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక మాస్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో..

ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పూర్తి చేసిన తర్వాత బాలయ్య బాబు మరో చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం లో మొదలు పెట్టనున్నారు. ఆ ప్రాజెక్ట్ అయితే జూలై సెకండ్ వీక్ లోనే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు పూర్తిస్థాయిలో ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తండ్రి పాత్రలో

తండ్రి పాత్రలో

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో 45 ఏళ్లకు పైబడిన ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపిస్తాడట. అంతే కాకుండా ఆయన 18 ఏళ్ళ కూతురికి మంచి తండ్రిగా మంచి ఫ్యామిలీ క్యారెక్టర్ తో కూడా మెప్పిస్తారని ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక కూతురు పాత్రలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించబోతోంది.

రాజశేఖర్ ముఖ్య పాత్రలో..

రాజశేఖర్ ముఖ్య పాత్రలో..

అయితే నందమూరి బాలకృష్ణ సినిమాలో అనిల్ రావిపూడి మరొక ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. బాలయ్య బాబు కి అలాగే రాజశేఖర్ కు మధ్యలో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే గతంలో కూడా వీరిద్దరి కలయికలో ఒక సినిమా రానున్నట్లు టాక్ కూడా వచ్చింది కానీ ఆ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కాలేదు.

కామెడీ పాత్రలో..

కామెడీ పాత్రలో..

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి రాజశేఖర్ ను బాలయ్య బాబు కి ఒక మంచి స్నేహితుడి పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట అది నెగిటివ్ పాత్ర అని కూడా టాక్ వచ్చింది కానీ ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిల్ రావిపూడి పూర్తిస్థాయిలో రాజశేఖర ను కామెడీ పాత్రలో చూపిస్తాడట.

ట్విస్ట్ ఏమిటంటే?

ట్విస్ట్ ఏమిటంటే?

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ ఉంటుందట. ప్రతి సినిమాలో కూడా రాజశేఖర్ కు సాయికుమార్ డబ్బింగ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా రాజశేఖర్ ని ఒరిజినల్ వాయిస్ తోనే చూపిస్తారని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X