NTR30: ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణకు నచ్చిన సీనియర్ హీరో.. బాబాయ్ పాత్రలోనే..?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల్లో చాలానే తెరపైకి వస్తున్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. అంతేకాకుండా స్టార్ దర్శకులు కూడా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనే ఆలోచనలో ఒకేసారి ఇద్దరు హీరోలను చాలా పవర్ఫుల్ పాత్రలో తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక మరికొంత మంది సీనియర్ హీరోలు నేటితరం హీరోలతో ప్రత్యేకమైన పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక బాలకృష్ణ కు నచ్చిన ఒక ఇష్టమైన సీనియర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయ్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్గెస్ట్ మల్టీస్టారర్
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సరికొత్త బాక్సాఫీసు రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఒక నమ్మకం అయితే ఉంది. జనవరి 7న రావాల్సిన ఈ సినిమా కరోనా వ్యాప్తి కారణంగా మళ్ళీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

సీనియర్స్ తో జూనియర్స్
RRR సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త మల్టీస్టారర్ ట్రెండ్ ను కొనసాగిస్తోంది అని చెప్పవచ్చు. అంతే కాకుండా సీనియర్ హీరోలు నేటి తరం యువ హీరోలతో కలిసి చాలా హ్యాపీగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఒక విధంగా సినిమాలకు అలాంటి పవర్ఫుల్ పాత్రలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అనే చెప్పాలి.

ఎన్టీఆర్ 30లో సీనియర్ హీరో
ఇక జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు లో మరొక ప్రత్యేకమైన పాత్ర కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట. దర్శకుడు కొరటాల శివ ఆ సినిమాను వచ్చే ఏడాది తెరపైకి తీసుకు రాబోతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయ్ గా కనిపించే ఒక పాత్ర కోసం సీనియర్ హీరోని సంప్రదించినట్లు సమాచారం.

రాజశేఖర్..
కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇది వరకే జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తారక్ పెదనాన్న పాత్రలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కనిపించారు. ఇక ఇప్పుడు కొరటాల శివ.. బాబాయ్ క్యారెక్టర్ కోసం యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్ కు బాలకృష్ణకు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా వీరు టచ్ లో ఉంటారని అంటుంటారు.

అలాంటి పాత్రలు ఇష్టమేనన్న రాజశేఖర్
చాలా కాలంగా రాజశేఖర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన నేటితరం హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్లు కూడా ఓపెన్ గా తెలియజేశారు. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్రకోసం తనను మొదట అనుకున్నారనీ విన్నట్లు తెలిపిన రాజశేఖర్ అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని కూడా చెప్పాడు.
Recommended Video

త్వరలోనే క్లారిటీ..?
ఇక కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయ్ పాత్రలో రాజశేఖర్ ను తీసుకుంటారా లేదా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును కొరటాల శివ వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











