బాలయ్య మూవీలో విలన్ శ్రీకాంత్ కాదు.. మరో హీరో పేరు లీక్.. అందుకే అక్కడకు వచ్చాడా.!

By Manoj

ఏ రంగంలోనైనా సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ ఉందంటే దానికి ఉన్న ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. అదే సినిమా ఇండస్ట్రీలో అయితే.. ఎంతటి హడావిడి, అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడలాంటి పరిస్థితే నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కలిసి చేయబోయే సినిమా విషయంలో కనిపిస్తోంది. త్వరలో వీళ్లిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా పట్టాలెక్కనుంది. దీంతో ఈ మూవీ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే..

ఇద్దరికీ ముఖ్యమే.. అందుకే ఇలా

ఇద్దరికీ ముఖ్యమే.. అందుకే ఇలా

గతంలో బాలయ్య - బోయపాటి కాంబోలో ‘సింహా', ‘లెజెండ్' అనే సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందుకే ఈ కలయికకు భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో మూవీ రాబోతుంది. ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఇటు బాలయ్య.. అటు బోయపాటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఎంతో మంది పేర్లు బయటకు

ఎంతో మంది పేర్లు బయటకు

ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడని, రోజా విలన్‌ రోల్ చేస్తుందని, శ్రీకాంత్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, జబర్ధస్త్ యాంకర్లు, ఆర్టిస్టులు ఇందులో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

బాలయ్య ముందే క్లారిటీ ఇచ్చాడు

బాలయ్య ముందే క్లారిటీ ఇచ్చాడు

ఇక, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ‘రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్యతో చేయబోయే సినిమా గురించి కొన్ని అంశాలను వెల్లడించాడు బోయపాటి శ్రీను. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు ఎవరినీ ఫైనల్ చేయలేదని వెల్లడించారు. అలాగే, ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

శ్రీకాంత్ కాదు.. మరో స్టార్ హీరో

శ్రీకాంత్ కాదు.. మరో స్టార్ హీరో

బోయపాటి శ్రీను ఎవరినీ ఫైలన్ చేయలేదని ప్రకటించినప్పటికీ తాజాగా సినిమా గురించి మరో వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అందరూ అనుకుంటున్నట్లు హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేయడం లేదట. ఈ పాత్రను టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ చేస్తున్నారనేదే ఆ వార్త సారాంశం.

అందుకే అక్కడకు వచ్చాడట

అందుకే అక్కడకు వచ్చాడట

రాజశేఖర్ ఈ సినిమాలో నటించడం దాదాపుగా ఖాయం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇటీవల జరిగిన ‘రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన తన భార్యతో కలిసి హాజరు కావడమేనని సమాచారం. తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న నేపథ్యంలోనే రాజశేఖర్ ఈ ఫంక్షన్‌కు వచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X