అయ్యో: రాజశేఖర్ కి రామ్ గోపాల్ వర్మ కోలుకోలేని దెబ్బ?

By Srikanya

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్ లో చిత్రం అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది హర్రర్ అనగానే పెద్ద ఆసక్తి చూపటం మానేసారు. పట్టపగలు టైటిల్ రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ...తండ్రి పాత్రలో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ వదిలారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే చిత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి రాజశేఖర్ నిర్మాత. దానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పట్టపగలు చిత్రంలో కొన్ని సన్నివేశాలు...జీవిత,రాజశేఖర్ లకు నచ్చలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ మార్చమని వర్మని అడిగారని చెప్పుకుంటున్నారు. అయితే మొదట అలాగే మారుద్దామని మాట ఇచ్చిన వర్మ తర్వాత దాని ప్రసక్తే తేకుండా తను కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపద్యంలో ఆ సీన్స్ మార్చకుండా రిలీజ్ చెయ్యలేరు. వర్మ వాటిని రీషూట్ చెయ్యటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం పెట్టుబడి బ్లాక్ అయ్యిపోయినట్లుంది.

Rajasekhar unhappy with RGV?

దానికితోడు వర్మ ..కేవలం దాన్ని 15 రోజుల్లో తీసేయటం, హర్రర్ కు బయిట పెద్దగా మార్కెట్ లేకపోవటం, వర్మ సైతం ప్లాఫుల్లో ఉండటం, రాజశేఖర్ ఈ మధ్యనే గడ్డం గ్యాంగ్ అంటూ డిజాస్టర్ ప్లాఫ్ ఇవ్వటంతో దాని బిజినెస్ జరగటం లేదు. దాన్ని ఇప్పుడు బిజినెస్ చెయ్యాలంటే మళ్లీ రీషూట్ చేసి ,మళ్లీ పబ్లిసిటీ క్యాంపైన్ చేసి విడుదల చెయ్యాల్సిన అవసరం ఉంది. మరి వర్మ దీనికి ఏమంటారో..ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. ‘బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.

రాజశేఖర్‌ మాట్లాడుతూ ''ప్రతీ చిత్రంలోనూ ఒక వైవిధ్యమైన పాత్రని పోషిస్తున్నా. వర్మతో 'పట్టపగలు' చిత్రం చేయడం తృప్తినిచ్చింది. మామూలుగా ఒక హార్రర్‌ సినిమా చేయాలనుకుంటే నేను నటించడం వల్ల సెంటిమెంట్‌ కూడా బాగా పండిందని వర్మ అనడం మరువలేను. ఒక రకంగా నేను వర్మ ఫోర్స్ చేసి స్క్రిప్టుని మార్చేశాను. నా 'గోరింటాకు' చిత్రంలాగే మహిళలకు ఈ సినిమా చేరువవుతుందనే నమ్మకముంది అన్నారు.

రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.

ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వరస సినిమాలు ప్రారంభించిన వర్మ... మొన్నీ మధ్య రౌడీ, ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటూ ముందుకు వచ్చారు. మంచు కుటుంబ ప్యాకేజి చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. మంచు విష్ణు ..మీడియా ముందుకు వచ్చి..మా సినిమాకు బాగా డబ్బులొచ్చాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఐస్ క్రీమ్ సైతం అదే పరిస్ధితి ఎదుర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X