కుక్కతో గడిపేందుకు రాజేంద్రప్రసాద్‌కు రూ.14 లక్షలు
హైదరాబాద్: మీరు విన్నది నిజమే. ఒక కుక్కతో గడిపి దాన్ని మచ్చిక చేసుకునేందుక రూ. 14 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్. అసలు విషయంలోకి వెళితే.... త్వరలో 'టామీ' అనే సినిమా తెరకెక్కబోతోంది. ఎ లవ్లీ డాగ్ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక.
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాబు పిక్చర్స్ బేనర్లో బోనం చినబాబు, హరిరామ జోగయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రలో బూగీ అనే కుక్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. 72 రకాల విన్యాసాలు చేయడం ఈ కుక్క ప్రత్యేకత. సినిమా మొత్తం కుక్క చుట్టే తిరుగుతుంది. జపాన్‌లో ఒక డాగ్ జీవితంలో జరిగిన యదార్థ గాదని ఈ సినిమాలో చూపిస్తున్నారు.

ఈ చిత్రం రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి కుక్కతో సినిమాలో నటించాలంటే దానికి కాస్త క్లోజ్ కావాలి కదా. అందుకే ఆ కుక్కను మచ్చిక చేసుకోవడానికి 14 రోజుల టైం కేటాయించాడు. ఇతర ఏ సినిమాల షూటింగులకు వెళ్లకుండా ఈ సమయం మొత్తం ఆయన ఈ కుక్కతో గడపడానికి రూ. 14 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇది కాకుండా సినిమాలో నటించినందుకు తీసుకునే రెమ్యూనరేషన్ అదనం.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి సన్నివేశానికి కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











