»   » మహేష్ తండ్రిగా కామెడీ కింగ్

మహేష్ తండ్రిగా కామెడీ కింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఆ మధ్యన అల్లు అర్జున్ సూపర్ హిట్ జులాయి లో చేసి మురిపించిన కామెడీ కింగ్ మరో పెద్ద హీరో సినిమాలో కనిపించనున్నారు. మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఆగడు చిత్రంలో ఆయన హీరో కి తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఫన్,సెంటిమెంట్ కలగలపిన పాత్రలో రాజేంద్రప్రసాద్ ని దర్సకుడు చూపించనున్నారని చెప్పుతున్నారు. అలాగే మహేష్ ..పోలీస్ పాత్రలో కనిపించనున్నారని ,పోకిరి, దూకుడు తరహాలో కాకుండా సినిమా మొత్తం పోలీస్ డ్రస్ వేస్తాడని చెప్పుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' వంటి హిట్ చిత్రం తర్వాత రాబోతున్న మరో చిత్రం 'ఆగడు'. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి బేనర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారి చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం(అక్టోబర్ 25) ఉదయం ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోలోని టెంపుల్‌లో జరిగింది.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ...'మహేష్ కెరీర్‌లో, నా కెరీర్‌లో ఇది ఓ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ...'మహేష్ బాబుతో దూకుడు, 1(నేనొక్కడినే) తర్వాత మేము చేస్తున్న మూడో సినిమా 'ఆగడు', ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత పరుచూరి కోటి మాట్లాడుతూ...నవంబర్ 15 నుంచి ఏకధాటిగా జరుగుతుంది. ఏప్రిల్‌కి పూర్తవుతుంది. సమ్మర్ స్పెషల్‌గా మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Rajendra Prasad will be seen in father role of Mahesh upcoming movie Aagadu and Rajendra Prasad will appear as Mahesh dad in the film. Aagadu will be directed by sreenu Vaitla and Mahesh Babu will be playing a police officer. 14 Reels Entertainment will produce the movie and SS Thaman scores music.. Aagadu entire shooting will be wrapped in 100-120 working days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu