శివాజికీ రివర్స్ ట్విస్ట్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్!?
నట కిరీటి రాజేంద్రప్రసాద్ రీసెంట్ గా మరో కామిడీ హీరో శివాజికీ ఓ రేంజిలో ట్విస్ట్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం...రెండు రోజుల క్రితం ఓపెన్ అయిన అయ్యారే చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. అందులోనూ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా స్వామి నిత్యానంద గెటప్ కనపించి మరీ అలరిస్తున్నారని ఫోటోలు వచ్చాయి. అయితే ఆ ఓపినింగ్ రోజు మీడియాకు రాజేంద్రప్రసాద్ తో పాటు శివాజీ కూడా కలసి స్టిల్స్ ఇచ్చాట్ట. కానీ విచిత్రంగా మరుసటి రోజు అన్ని పత్రికల్లో కేవలం రాజేంద్రప్రసాద్ ఫొటో మాత్రమే కవరేజ్ వచ్చింది. అసలు అది శివాజి సినిమా అనే గుర్తింపే లేకుండా పోయింది. దాంతో కంగారుపడ్డ శివాజి మండిపడుతూ...ఎంక్వైరీ చేస్తే అది రాజేంద్రుడు ఇచ్చిన ట్విస్టే నని బయిటపడిందట. రాజేంద్రప్రసాద్ ప్రెస్ మీట్ అయిన మీడియా ఆఫీసులకు ప్రత్యేకంగా తన ఫోటో స్టిల్ ని ప్రచురించమంటూ మెయిల్ చేయించాడట. ఇది తెలిసిన శివాజీ ఇన్నాళ్ళూ తను అందరికీ ట్విస్టులు ఇవ్వటమే కానీ ఇదేంటి ఈ రివర్స్ ట్విస్ట్ అని షాక్ అయిపోయాట్ట.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











