అల్లు అర్జున్ కోసం పోలీసుగా రాజేంద్రప్రసాద్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర ఫన్నీగా ఉండే పోలీస్ అని తెలిసింది. త్రివిక్రమ్ రాసే ఫన్ తో కూడిన పంచ్ డైలాగులకు రాజేంద్రప్రసాద్ అద్బుతమైన మాడ్యులేషన్ తో అదరకొడుతున్నాడని సమాచారం. అలాగే ఈ పాత్ర చివర్లో సెంటిమెంట్ ని కూడా పండించనుంది. ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని చెప్తున్నారు. అలాగా రాజేంద్రప్రసాద్ సైతం ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావటంతో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ పార్ట్ లు షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. అలాగే ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి టైటిల్ పార్టనర్ అని పెట్టే అవకాశం ఉందని సమాచారం. మొదట ఈ చిత్రానికి హనీ అనే టైటిల్ పాపులర్ అయ్యింది. అయితే ఆ టైటిల్ వేరే చిత్రం కోసం విజయ్ భాస్కర్ రిజిస్టర్ చేసిందని తెలిసిందే. అల్లు అర్జున్ సైతం తమ చిత్రం టైటిల్ హనీ కాదని చెప్పుకొచ్చారు. అలాగే అస్సలు ఈ టైటిల్ కీ చిత్రానికి సంభందం లేదని, అస్సలు తాము ఆ టైటిల్ ని కన్సిడర్ చేయలేదని అల్లు అర్జున్ ఖండిస్తున్నారు.మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











