రజనీ-రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ సంగతేంటి?

ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు కె.వి. ఆనంద్ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఈ విషయమై కెవి ఆనంద్‌ను ప్రశ్నించగా...'పలువురు టాప్ యాక్టర్స్, ప్రొడ్యూసర్లు సినిమాలు చేయాలని తనకు ఆఫర్ ఇచ్చారని, కానీ నేను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని, ముందు నేను కథ, స్క్రిప్టు రెడీ చేసుకున్న తర్వాతే కాస్టింగ్ గురించి ఆలోచిస్తాను' అని సమాధానం ఇచ్చారు.
కెవి ఆనంద్ వివరణ ఇచ్చారే తప్ప...రజనీ-రామ్ చరణ్ మల్టీ స్టారర్ ప్రాజెక్టు వార్తను ఖండించ లేదు. కాబట్టి వీరి కాంబినేషన్లో సినిమా రూపొందించే అవకాశం భవిష్యత్ తో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ భారీ ప్రాజెక్టుపై రజనీ, రామ్ చరణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే...ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రామ్ చరణ్ 'నాయక్' చిత్రంలో నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో చెర్రీ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











