రజనీకాంత్ ‘రాణా’ మూల పడినట్లేనా?
రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రాణా" ఆయన అనారోగ్యం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇక మూలన పడినట్లే అనే వాదన చెన్నయ్ సినీవర్గాల్లో వినిపిస్తోందని. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం కుదుట పడినప్పటికీ 'రాణా" కు తగిన విధంగా నటించే పొజిషన్ లో ఆయన లేరని నిర్మాతలు బావిస్తున్నారు. వాస్తవానికి 'రాణా" సినిమాను హాలీవుడ్ సినిమా 'గ్లాడియేటర్" తరహాలో తెరకెక్కించాలనుకున్నారు.
అయితే ప్రస్తుతం రజనీ పరిస్థితి దృష్ట్యా అలాంటి సీన్లలో ఆయన నటించడం కష్టం, డాక్టర్లు కూడా ఆయనకు ఎక్కువ రెస్టు కావాలని సూచించారు కూడా. రజనీ నటించడానికి సాహసం చేసినా ఆయన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో రాణా సినిమా మరో కొన్ని నెలల పాటు మూల పడే అవకాశమే కాదు.... ఈ ప్రాజెక్టు పూర్తిగా రద్దయినా ఆశ్యర్య పడనక్కర్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











