రజనీ 'శివాజీ' కి ముందు బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి ఓ మెగా ప్రాజెక్టుతో ఆయనని సంప్రదించాడు.అది రామాయణాన్ని తెరకెక్కించాలని. అందులో రజనీకాంత్ ని రావణాసురుడు పాత్రకు అడిగారు.అయితే రజనీ కొంత సమయమడిగారు. ఈ లోగా రాజ్ కుమార్ సంతోషి ఆ సినిమాకు వంద కోట్లకు పైగా బడ్జెట్టు అవుతుందని అంచనా వేసి ,నిర్మాత దొరకక వదిలేసారు.కానీ ఇప్పుడు ఆయన దగ్గర నిర్మాత ఉన్నాడు. అజయ్ దేవగన్ ని రాముడుగా,కాజోల్ ని సీత పాత్రలకి ఒప్పించాడు. ఇక మిగిలింది రావణుడు పాత్ర కోసం రజనీ అంగీకారమే.అయితే కుసేలన్ రిలీజ్ అయ్యాక ఫైనలైజ్ చేస్తానని రజనీ మాటిచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ డేట్స్ ఇస్తే శంకర్ 'రొబొ' కు క్లాష్ అవుతుందని మరో ఆలోచనలో ఉన్నారట. ఎవరికి వారే బల్క్ గా డేట్స్ అడగటంతో ఎంత గొప్ప ప్రాజెక్టు అయినా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారట.అందులోనూ కుశేలన్ రికార్డు స్ధాయిలో ఐదు నెలల్లో పూర్తివటంతో ఆయన రాబోయే రోజుల్లో చేయబోయే సినిమాలు కూడా ఇలానే ప్లాన్ చేస్తే బావుంటుందని దగ్గరవారితో సూచనప్రాయంగా రజనీ చెప్పారట.దీన్ని బట్టి రజనీ ...రావణుడు అవటం కల్లే నని అంటున్నారు.అయితే రాజ్ కుమార్ సంతోషి మాత్రం రావణుని పాత్రని పూర్తిగా మార్చానని చాలా తెలివిగలవాడిగా,మాస్టర్ మైండ్ తో గేమ్స్ ఆడే వాడుగా మార్చి రజనీని ఎప్రోచ్ అయి ఒప్పిద్దామని ఉత్సాహంగా ఉన్నాడట.
Story first published: Friday, May 15, 2026, 14:09 [IST]