సూపర్ స్టార్ సినిమా టైటిల్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సూపర్‌స్టార్ రజినీకాంత్.. దర్భార్ చిత్రంతో సంక్రాంతికి భారీ హిట్టు కొట్టాడు. ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ అనగానే అందరికీ అంచనాలు ఆకాశన్నంటాయి. వాటికి తగ్గట్టే తలైవా అభిమానులకు కిక్కిచ్చేలా దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం దాదాపు 250కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూనే ఉంది.
ఓ వైపు దర్బార్ దూసుకుపోతూ ఉంటే మరోవైపు తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేశాడు తలైవా. తల అజిత్‌తో వీరం, వేదాలం, వివేకం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శివ.. రజినీతో చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.

సూపర్‌స్టార్ రజినీకాంత్ 168వ చిత్రం శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు అన్నాత్త అనే టైటిల్‌ను ఖరారు చేశారని టాక్. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ నుండే ఈ టైటిల్‌ను తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఖుష్బూ, మీనా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











