Coolie Vs War 2: కూలీతో రజనీ.. వార్ 2తోో ఎన్టీఆర్, హృతిక్.. ఎవరి డామినేషన్ ఎక్కడెక్కడ అంటే?
తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం థియేటర్లలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ వచ్చి అలరిస్తున్నాయి. జూలై లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం, విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలు పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఆగస్టులోనూ మరింత భారీ చిత్రాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీంతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూలి Vs వార్ 2 ఫైట్ కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి భారీ రెస్పాన్స్ ఉందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏ చిత్రం వైపు హవా ఉందనే విషయానికొస్తే..
కూలికి భారీ రెస్పాన్స్..
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం కూలి. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే చివరిగా రజనీకాంత్ జైలర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు స్టేట్స్ లో కూలి చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.

వార్ 2కి ఈ ఏరియాల్లో భారీ క్రేజ్..
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 చిత్రం కూడా ఆగస్టు 14నే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. కూలి చిత్రంతో వార్ 2 చిత్రం క్లాష్ కాబోతోంది. ఇక బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న వార్ 2 చిత్రానికి కూడా వరల్డ్ వైడ్ గా రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి ముఖ్యంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో భారీ రెస్పాన్స్ కనిపిస్తోందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓవర్సీస్ లో నార్త్ అమెరికా, UK, గల్ఫ్ కంట్రీస్ లో ఈ చిత్రానికి అత్యధిక రెస్పాన్స్ వార్ 2కు ఉండటం విశేషం.
కూలి x వార్ 2..
వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ కూలి, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రాలకు వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఓకే రోజు విడుదల కాబోతుండటంతో ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తిని నెలకొల్పుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల్లో కూలి చిత్రానికే భారీ రెస్పాన్స్ దక్కుతుందని విశ్లేషణ. మరోవైపు ఓవర్సీస్, నార్త్ ఇండియా లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2కి మొదటి ప్రాధాన్యత దక్కుతోందని తెలుస్తోంది.
ఇక ఏ చిత్రానికి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. డే1 బాక్సాఫీస్ రిపోర్ట్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక రజనీకాంత్ కూలి చిత్రం రూ.350 కోట్లతో నిర్మితమైంది. శృతి హాసన్, పూజా హెగ్దే, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, క్యామియోలో అమీర్ ఖాన్ నటించడం విశేషం. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2కు 400 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించడం విశేషం.


Click it and Unblock the Notifications











