దర్బార్ నష్టాలు.. కనికరించాలని డిస్ట్రిబ్యూటర్ల వినతి
సంక్రాంతి బరిలోకి దర్బార్ సినిమాతో దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ వసూళ్లనే రాబట్టాడు. విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రజినీకాంత్ మొట్టమొదటి కాంబినేషన్ కావడం, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ చేసి మరోసారి తలైవా స్టామినాను నిరూపించింది.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్..
రజనీ-మురుగదాస్ కాంబినేషన్‌లో దర్బార్ సినిమా రాబోతోందనగానే.. తమిళ నాటే కాదు అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ అంచనాలు పెరిగాయి. ముంబై బ్యాక్ డ్రాప్, కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్‌గా రజినీ నటించడం వంటి అంశాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.

ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు..
రజినీ సినిమా అంటే కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. వివిద దేశాలు దాటి ఖండాంతర వరకు దాని హవా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసిన దర్బార్ మొదటి రోజే దాదాపు వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు ప్రకటించారు. ఇలా ఫస్ట్ డే కలెక్షన్లలో రజినీ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.

మొత్తంగా 250కోట్ల గ్రాస్..
తమిళ నాట దర్బార్‌కు పోటీ లేకపోవడం కలిసి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు, అల వైకుంఠపురములో రెండూ పోటా పోటీగా ఉండటంతో అంతగా కలిసి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు సమాచారం. అయితే లెక్కలు మాత్రం ఇలా ఉంటే రియాల్టీలో పరిస్థితి వేరేలా ఉంది.

రజినీ ఆదుకోవాలి..
దర్బార్ చిత్రాన్ని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలనే మిగిల్చిందట. అయితే తెలుగు రాష్ట్రాల వరకు దర్బార్‌కు ఎలాంటి నష్టాలు వాటిల్లలేదని తెలుస్తోంది. మిగతా ఏరియాల్లో భారీ రేటుకే దర్బార్ అమ్ముడు పోయింది. ఎంతో కొంత పరిహారం ఇప్పించాలని కోరుతూ రజనీని కలవాలని పంపిణీదారులు ఎదురు చూస్తున్నారన్న వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











