హైదరాబాద్ లో రజనీకాంత్..చిరు కోసం వెయిటింగ్

By Srikanya

హైదరాబాద్‌: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం 'లింగ'. సోమవారం హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగే 'లింగ' ఆడియో విడుదల వేడుకలో ఆయన పాల్గొననున్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. ఇక రజనీని కలవటానికి టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఈ రోజు అపాయింటమెంట్ ఫిక్స్ చేసుకున్నారు. వారిలో చాలా మంది ఆయన సన్నిహితులే. అయితే ఆయన మాత్రం మెగా స్టార్ చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే...ఈ ఆడియో రిలీజ్ కి రజినీకాంత్ తో పాటు, అనుష్క, సోనాక్షి సిన్హా, ఎఆర్ రెహమాన్, కెఎస్ రవికుమార్ తదితరులు హాజరవుతున్నారు. అంతేకాదు ఈ పంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా తీసుకురావడానికి అడుగుతున్నారు. కానీ చిరంజీవి బిజీగా ఉండటంతో ఇప్పటి వరకూ ఏ విషయం చెప్పలేదని, చివరి నిముషాల్లో అయనా ఖాళీ చేసుకుని వచ్చే అవకాసం ఉందంటున్నారు.

చిత్రం ప్రత్యేకతలు

Rajinikanth in Hyderabad for Linga Audio

దర్శకుడు మాట్లాడుతూ...''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

నిర్మాత మాట్లాుడుతూ... ''చిత్రంలో రజనీకాంత్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ నాయకుడిగా కనిపిస్తాడు. అన్ని వర్గాలవారినీ అలరించేలా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సినిమాలో రజనీ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంది'' అన్నారు.

ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు.

ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంజినీరు పాత్ర వస్తుందని తెలుస్తోంది. సినిమాకు కీలకంగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. దొంగ పాత్రకు, బ్రిటీష్ వారి సమయంలో కనిపించే ఇంజినీరు పాత్రకు ఉన్న లింకేంటి, ఇంజినీరు గా రజనీ ఏం చేసాడు...అది ప్రస్తుత కాలానికి ఎలా ముడిపెట్టారన్నది కీలకం కానుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దాదాపు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X