Rajinikanth Jailer: అబ్బా రజనీ 'జైలర్' అక్కడి నుంచి ఎత్తుకొచ్చారా? ఇదేం అరాచకం రా అయ్యా?
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. న్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో జైలర్ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. ఆయన క్రేజ్, పాపులరిటీ మామూలుగా ఉండదు. తలైవా అంటూ అభిమానులు ఆయన్ని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో జోరు చూపిస్తున్న రజనీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్. రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది.

అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో... ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నువ్వు కావాలయ్యా.. నువ్వు రావాలయ్యా సాంగ్ విడుదలై ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ పాటతో రీల్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథిపాత్రల్లో మెరవనున్నారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను గమనిస్తే... రజనీ కాంత్ స్టైల్, స్వాగ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి అర్థం అవుతుంది.
అయితే ట్రైలర్ గమనిస్తే... ఈ సినిమా ఒక రిటైర్ అయిపోయిన వ్యక్తి కథగా చూపిస్తున్నారు. కుమారుడు, మనవాళ్లతో హాయిగా గడుపుతున్న సమయంలో.. వారికి ఓ సమస్య రావడంతో అతని బ్యాక్ గ్రౌండ్ అంతా మరోసారి రివ్యూ చేస్తున్నట్లుగా చూపించారు. అయితే ఇదంతా చూస్తే మనలో చాలా మందికి భాషా సినిమాకి మోడ్రన్ టచ్ ఇచ్చి మరోసారి తెరకెక్కిస్తున్నారేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే జైలర్ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అంటున్నారు. హాలీవుడ్ లో నోబడి పేరుతో తెరకెక్కిన మూవీ.. ఈ జైలర్ మూవీ సేమ్ అంటున్నారు. నోబడి సినిమాలో కూడా రిటైర్ అయిపోయిన ఒక ఎఫ్బీఐ ఏజెంట్ తన కుటుంబానికి ఆపద వస్తే మళ్లీ ఎలా యాక్టివ్ అయి... తన కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఇప్పుడు రజనీ జైలర్ ప్రమోషనల్ వీడియో చూసిన తర్వాత.. ఈ మూవీ నోబడికి ఫ్రీమేక్ అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











