రజినీ-కమల్ హాస‌న్ మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా తలైవా రెమ్యునరేషన్.. విజయ్ రికార్డ్ బ్రేక్ ?

Rajini- Kamal: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయకుడు కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు మరోసారి ఒకే తెరపై కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో ఈ సినిమా గురించి దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాదు.. మొత్తం భారతీయ సినిమా రంగంలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్ వివరాలు ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ నిలవనుంది. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ బడ్జెట్‌లో సింహభాగం కేవలం ప్రధాన నటీనటులు, దర్శకుడి రెమ్యునరేషన్లకే ఖర్చవుతోందనే వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Rajinikanth-Kamal Haasan Multistarrer Creates Buzz Over Thalaivar Rajinikanth s Record Remuneration

ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్‌ హీరో రజనీకాంత్ . ఈ సినిమా కోసం రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం తలైవా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.225 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఇప్పటివరకు విజయ్ దళపతి (Vijay) తన చివరి సినిమా 'జన నాయకన్' కోసం రూ.220 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని కోలీవుడ్‌లో టాప్‌లో ఉన్నారని, ఇప్పుడు ఆ రికార్డును రజనీ దాటేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

మరోవైపు కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. సాధారణ రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌లో ఆయన దాదాపు రూ.200 కోట్ల వరకు అందుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే ఇద్దరు లెజెండరీ నటుల పారితోషికాలే కలిపి రూ.440 కోట్లకు పైగా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో హీరోలు, దర్శకుడి ఫీజులే దాదాపు రూ.500 కోట్ల వరకు చేరుకున్నాయనే లెక్కలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందించనున్నది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ . ఇప్పటికే రజనీ-నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అదే కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో సంగీతంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రజనీ, కమల్ వంటి ఇద్దరు దిగ్గజాల కోసం అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌నుకమల్ హాసన్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరోవైపు రెడ్ గెయిట్ మూవీస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, 'జైలర్ 2' పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X