Rajini Kamal Combo: 46 ఏళ్ల తర్వాత రజినీ, కమల్ మళ్ళీ మ్యాజిక్.. దర్శకుడు ఎవరంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఓపెనింగ్ డే కాస్త మిక్స్డ్ టాక్ కూడా దక్కింది. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ తో కలిసి ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
వీరిద్దరి కలయికలో 46 ఏళ్ల కింద తమిళంలో చిత్రం వచ్చింది. ఆ తర్వాత నుంచి కలిసి నటించే అవకాశం రాలేదు. ఎవరి కెరీర్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. ఇక ఇప్పుడు మళ్లీ లెజెండరీ యాక్టర్స్ కాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటికే కమల్ హాసన్ రజినీకాంత్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చారు. ఆ ప్రకారమే ఇప్పుడు రజనీకాంత్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

వీరిద్దరి కలయికలో ఓ భారీ గ్యాంగ్ స్టార్ చిత్రం రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లు రాబోతున్న చిత్రానికి నిర్మాతగా కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ లో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఓకే ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం. ఇప్పటికే లోకేష్ కనకరాజు వీరిద్దరితో తీయబోయే సినిమాపై చర్చలు జరుపుతున్నారని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.
ఇక ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్, అటు లోకనాయకుడు కమల్ హాసన్ తో చిత్రాలు చేసి ఉన్నారు. కమల్ హాసన్ తో తీసుకొచ్చిన విక్రమ్ చిత్రం ఎంతంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక లేటెస్ట్ గా రజనీకాంత్ తో కూలి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఏకంగా భారీ తారాగణాన్ని డీల్ చేయడం విశేషం. ఈ క్రమంలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి భారీ స్టార్స్ ను వారి అభిమానులు మెచ్చేలా ఎలా చూపించాలో లోకేష్ కనగరాజ్ కు సరిగ్గా తెలిసి ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి దాదాపు 21 చిత్రాల్లో నటించారు. 1975 నుంచి 1979 మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చి అలరించాయి. ఇక వీరద్దరూ ఫస్ట్ అపూర్వ రాగంగల్ అనే చిత్రంతో వెండితెరపై మెరిశారు. చివరిగా అల్లావుద్దీన్ అద్భుత విలాక్కుమ్ అనే చిత్రంతో అలరించారు. ఇక లోకేష్ కనగరాజ్ కూలి చిత్రంతో ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోవడంతో నెక్ట్స్ తీయాల్సిన ఖైదీ 2ను కాస్తా పక్కకు పెట్టి, కమల్ హాస్ - రజనీకాంత్ చిత్రంపై ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కూలి మాత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











