పాలిటిక్స్ కోసమే కమల్ హసన్, రజినీకాంత్ మల్టీస్టారర్.. విబేధాలు రావడంతో..?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సంఖ్యలో అభిమానులు సంపాదించుకున్న వారిలో రజినీకాంత్ తో పాటు కమల్ హాసన్ ఒకరు. సినిమాలకు సంబంధించి మార్కెట్ పరంగా అప్పుడప్పుడు వీరిమధ్య పోటీ జరిగినప్పటికీ ఒకరు నటనతో హిట్టు కొడితే మరొకరు కలెక్షన్స్ తో సక్సెస్ అవుతుంటారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కమల్ రజినీకాంత్ వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే ఉంటున్నారు.

రాజకీయాల కోసం..
ఇక రాజకీయ పరంగా వీళ్ళు ఒక్కటి కాబోతున్నారని గత ఏడాది వార్తలు ఒక రేంజ్ లో వచ్చాయి. అందుకోసం రజినీకాంత్ - కమల్ హాసన్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా కూడా చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. మంచి కథ సెట్టయితే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అప్పట్లో ఈ ఇద్దరు హీరోలు కూడా క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గ్యాప్ రావడంతో..
గత ఏడాది తమిళ రాజకీయాల్లో గొడవలు ముదురుతున్న సమయంలో రజినీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ తో రాబోయే రోజుల్లో సరికొత్త మార్పులు చోటు చెసుకోబోతున్నట్లు జనాలకు అర్ధమయ్యింది. రజినీకాంత్ కమల్ హాసన్ చేతులు కలిపే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే మళ్ళీ వారిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఏం జరిగి ఉంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బలం పెంచుకోవాలని..
గతంలో రజినీకాంత్, కమల్ హాసన్ రాజకీయపరంగా కొన్ని చర్చలు కూడా జరిపారు. అందుకే బాండింగ్ పెరిగేలా ఒక మంచి మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నారు. అందుకోసం చాలా మంది రచయితలతో మాట్లాడడం కూడా జరిగింది. ముందుగా కథను సెట్ చేసుకున్న తరువాత దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు.
Recommended Video

భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా?
దాదాపు స్క్రిప్ట్ తో పాటు దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడని తమిళ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అది జరిగి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పోనీ కరోనా వలన ఆగిందా అనుకుంటే.. భవిష్యత్తులో సినిమా ఉంటుంది అనే ఒక చిన్న క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అని అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు నమ్మకం పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు మరికొందరు.


Click it and Unblock the Notifications











