రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి...కలిసి మరోసారి!
చెన్నై : రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరు ముగ్గురు మళ్లీ కలవబోతున్నారు. అయితే వీరు ముగ్గురు కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారనుకుంటే పొరపాటే...వీరు ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారు.
ఈ ముగ్గురు భారతి రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నకొడియమ్ కొడివీరనమ్' అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్‌కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో దర్శకుడు భారతి రాజా రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవిలతో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఆ చొరవతోనే తాను ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకకు వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం ఆడియో వేడుక మధురైలో జరిగే అవకాశం ఉంది. 'అన్నకొడియమ్ కొడివీరనమ్' చిత్రంలో భారతిరాజా తనయుడు మనోజ్ భారతి రాజా హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్, ఇనియా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

కెరీర్ తొలి నాళ్లలో కమల్ హాసన్, శ్రీదేవి కలిసి నటించిన చిత్రంలోని దృశ్యం

రజనీకాంత్ తో శ్రీదేవి రొమాంటిక్ పిక్

రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘16 Vayadhiniley' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది.

70, 80ల్లో రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు.

అయితే ఈ ముగ్గురు స్టార్లు ‘అన్నకొడియమ్ కొడివీరనమ్' ఆడియో వేడుకకు వస్తున్నారా? లేరా? అనేది త్వరలో ఖరారు కానుంది.


Click it and Unblock the Notifications











