షాకింగ్: రజనీకాంత్ పారితోషికంగా అన్నికోట్లా?
హైదరాబాద్: సౌతిండియా స్టార్ రజనీకాంత్ త్వరలో ‘లింగా' చిత్రం ద్వార ప్రేక్షకుల ముందుకు రాబోతున్నసంగతి తెలిసిందే. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 165 కోట్లకు కొనుగోలు చేసింది.
తాజాగా ఈ చిత్రానికి రజనీకాంత్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి రజనీకాంత్ రూ. 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అదే నిజమైతే రజనీకాంత్ రేంజి ఏమిటో ఊహించుకోవచ్చు. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్లో రజనీకాంత్ రెమ్యూనరేషనే ఎక్కువ అని అంటున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది.
రజనీ-రవికుమార్ కాంబినేషన్ కూడా ఇంత క్రేజ్ పెరగడానికి మరో కారణం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే. మరి ఇపుడు ‘లింగా' చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











