రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే కేవలం తమిళ్ ఆడియెన్స్ అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇటీవల పొలిటికల్ వార్తలతో అందరిని కన్ఫ్యూజన్ కు గురి చేసి ట్విస్ట్ ఇచ్చిన తలైవా త్వరలో మరో షాక్ ఇవ్వబోతున్నారనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒక దర్శకుడు తీరు కూడా అనుమానాలను. కలిగిస్తోంది.
Recommended Video

ఎన్ని జనరేషన్స్ మారుతున్నా..
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే చాలు ఆయన అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ ను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఎన్ని జనరేషన్స్ మారుతున్నా కూడా తలైవాకు అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి కాలంలో యువత ఎక్కువగా ఆయన స్టైల్ ను ఎంతగానో ఇష్టపడుతోంది.

అదే ఆలోచనలో ఉన్నారా?
ఇక రజనీకాంత్ ఏడు పదుల వయసులో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవ్వగా అభిమానులు ఎంతగానో సంతోషించారు. కానీ కొన్ని రోజులకే మళ్ళీ ఆయన వెనుకడుగు వేయడం అందరిని షాక్ కు గురి చేసింది. ఇక సినిమాల విషయంలో కూడా తలైవా అలాంటి ఆలోచనతోనే ఉన్నారా అనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

సరైనా బాక్సాఫీస్ హిట్ లేదు
రజనీకాంత్ చివరగా దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. నిజానికి రజనీకాంత్ గత కొన్నేళ్లుగా సరైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవడం లేదు. ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆయన మార్కెట్ మీద మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడలేదని ప్రతి సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ తోనే అత్థమవుతోంది.

సినిమాలను కూడా తగ్గించే ఆలోచనలో..
ఇక ఇటీవల ఒక దర్శకుడు తీరుతో తలైవా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. డైరెక్టర్ శివతో అన్నత్తే అనే ఒక సినిమాను చేయడానికి సిద్ధమవ్వగా కోవిడ్ వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక ఆరోగ్య సమస్యల వల్ల రాజకీయాలకు కూడా దూరమైన రజనీకాంత్ సినిమాలను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రాప్ అయిన దర్శకుడు?
దర్శకుడు శివ రజనీకాంత్ అన్నత్తే సినిమాను పక్కనపెట్టి మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చినట్లు టాక్ వస్తోంది. సూర్యతో కూడా శివ ఒక సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రజినీకాంత్ ఇప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో శివ డ్రాప్ అయినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











