Jailer 2: జైలర్ 2 రిలీజ్‌పై ఊహించని ట్విస్ట్... రజనీకాంత్ మూవీ థియేటర్లలోకి ఎప్పుడంటే?

సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ మంచి జోరు మీదున్నారు. 75 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ వరుసగా క్రేజీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2లో నటిస్తున్నారు తలైవా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం వీరిద్దరిక కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ జైలర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న జైలర్ 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ జైలర్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, మిర్ణా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా, సూరజ్ వెంజారమూడు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తొలిభాగంలో మాదిరిగానే జైలర్ 2లోనూ ఇతర భాషలకు చెందిన స్టార్స్ గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా నటించాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు.

Rajinikanth s Jailer 2 Release Postponed Buzz Around New Release Date Goes Viral

భారీ అంచనాల మధ్య వస్తున్న జైలర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఏకంగా 160 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తద్వారా అత్యధిక ఓటీటీ బిజినెస్ జరిగిన తమిళ సినిమాగా జైలర్ 2 నిలిచింది. అలాగే థియేట్రికల్ రైట్స్ కోసం పలు భాషలకు చెందిన బడా డిస్ట్రిబ్యూటర్లు క్యూకడుతున్నారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోనూ రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేట్రికల్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. త్వరలోనే జైలర్ బిజినెస్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 12న జైలర్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ముందే ప్రకటించారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్‌ను అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను నెల్సన్ పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో మే చివరి నాటికి ఫైనల్ కాపీ రెడీ చేసి.. వీలైనంత సెన్సార్‌కి వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారట.

జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతుండగా.. అదే నెలలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో జూలైలో థియేటర్లు ఖాళీగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో నిర్మాతలు ఈ నెలపై కన్నేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఆగస్ట్ 12నే జైలర్ 2 రిలీజ్ అవుతుందని వాదిస్తున్నారు. ఇప్పుడు జైలర్ 2 విడుదల గురించి మరో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. దీని ప్రకారం జైలర్ 2 ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో జైలర్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వినాయక చవివి పర్వదినంతో పాటు లాంగ్ వీకెండ్‌, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఈ డేట్ ఫిక్స్ చేసినట్లుగా కోలీవుడ్ టాక్. అయితే రిలీజ్‌పై జైలర్ 2 యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read more about: rajinikanth jailer 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X