twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లింగా’ చిత్రాన్ని సేవ్ చేయడానికే రజనీకాంత్ లేఖ?

    By Bojja Kumar
    |

    చెన్నై: జైలు నుండి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జయలలిత అరెస్టుకు నిరసనగా తమిళ సినీ పరిశ్రమ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టగా రజనీకాంత్ దూరంగా ఉన్నారు. అయితే విడుదలైన తర్వాత ఆయన శుభాకాంక్షలు తెలుపడం చర్చనీయాంశం అయింది.

    అయితే దీని వెనక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. త్వరలో రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రం విడుదల ఉన్న నేపథ్యంలో....ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్తగా రజనీకాంత్ ఈ విధంగా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. గతంలో జయలలితకు అనుకూలంగా లేని కమల్ హాసన్, విజయ్ సినిమాలకు ఇబ్బందులు ఏర్పడ్డ విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

    Rajinikanth's Letter To Jayalalitha

    లింగా సినిమా విషయానికొస్తే...
    రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో రజనీకాంత్ సంతానంతో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో రజనీకాంత్ ను ఎంత స్టైలిష్‌గా చూపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. పోస్టర్ రిలీజ్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    రజనీకాంత్ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు.

    ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనిపించనున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

    English summary
    Innumerable wishes were poured in when Jayalalitha, yesteryear Tamil actress and ex CM of Tamil Nadu walked out of Bangalore's Central Jail. But the most prominent of all was a letter from Rajinikanth conveying his wishes on her return to the State.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X