twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీక్ : రజనీ 'లింగ' కథ ఇదే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : సూపర్‌స్టార్‌ రజనీ బర్తడే కానుకగా వస్తున్న 'లింగ' డిసెంబర్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికోసం డిసెంబర్‌ 9న అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ చేయగా కేవలం రెండు గంటల్లోనే రెండు వారాలకు థియేటర్స్‌ అన్నీ నిండిపోయాయి. ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కథ ఏమిటి..ఏమి విశేషాలు ఉన్నాయి ఈ కథలో అనేది ఇప్పుడు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ని అక్కడ కొందరి నుంచి వినిపించింది. ఆ కథేమిటో..దాని కమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

    ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

    ఈ చిత్రంలో రజనీకాంత్ దొంగగా, ఇంజనీరు గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం కథ మొత్తం ఓ వంతెన చుట్టూ తిరుగుతుంది. బ్రిటీష్ వారి కాలంలో అప్పటి ఇంజినీర్ రజనీకాంత్ ఓ వంతెన ని దగ్గరుండి కట్టిస్తారు. ఇప్పుడు వంద సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వంతన ని పడగొట్టి కొత్తది కట్టాలని ఇప్పటి రాజకీయనాయుకులు ప్రయత్నిస్తూంటారు. ఎందుకంటే ఆ కాంటాక్ట్ సాధిస్తే కొన్ని కోట్లు వెనకేయవచ్చని. అయితే కొందరు దాన్ని వ్యతిరేకించగా ప్రభుత్వం కమిటీ వేస్తుంది.

    ఆ కమిటీవచ్చి పరిశీలించి ఆ వంతెన కట్టాల్సిన అవసరం లేదంటూ తేలుస్తాడు. ఆ వంతెన స్ట్రాంగ్ గా ఉందని రిపోర్టు ఇవ్వబోతాడు. ఈ విషయం తెలుసుకున్న పొలిటీషియన్స్ అతన్ని చంపేస్తాడు. చనిపోయే అతను ఆ మ్యాటర్ మొత్తం ఉన్న ఫైల్ ని ఓ పెన్ డ్రైవ్ లో పెట్టి విసిరేస్తాడు. అది వెళ్లి ప్రక్కనే మూసేసి ఉన్న శివాలయంలో ఉన్న లింగంపై పడుతుంది. ఆ ఇంజినీరు చనిపోయేటప్పుడు తన చుట్టూ మూగిన జనంతో ఆ శివాలయం తెరిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పి మరణిస్తాడు.

    ఇప్పుడు ఆ శివాలయ్యాన్ని తెరపించాలని ఊరు వారు అనుకుంటారు. అయితే అక్కడో చిన్న ఇబ్బంది ఉంటుంది. ఆ శివాలయాన్ని అప్పటి రజనీ కట్టించి ఉంటాడు. దాంతో తిరిగి ఆయన వారసులు చేతే తెరిపించాలి. దాంతో ఆ వారసుడు అంటే మనవడు కోసం వెతకటం మొదలెడతారు. ఆ వారసుడు ఇప్పుడు ఓ దొంగగా జీవితం వెళ్లబోస్తూంటాడు. అతన్ని కలిసిన ఊరిజనం... ఆ శివాలయం ఓపెన్ చెయ్యమని అడుగుతారు. దాంతో ఆ ఊరు ని వచ్చి దోచుకుందామని ప్లాన్ చేసిన దొంగ రజనీకాంత్ అక్కడ ఈ పెన్ డ్రైవ్ దొరకటం, ఆ వంతెన తన తాతయ్య కట్టించిందని తెలియటంతో దాన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. అయితే పొలిటీషియన్స్ మరో ముందగడు వేసి...ఆ వంతెనను బాంబులతో పేల్చేద్దామని ప్రయత్నం చేస్తారు. అప్పుడు దొంగ రజనీ ఏం చేసాడు. ఎలా కాపాడి తన తాత ఆశయాన్ని నెరవేర్చి అక్కడ ప్రజలకి న్యాయం చేసాడు అనేది మిగతా కథ.

    అయితే ఈ కథ కేవలం అక్కడ చెప్పుకోబడుతున్నది మాత్రమే. అందులో ఎంతవరకూ నిజమన్నది రేపీ పాటికి కానీ తెలియదు.

    చిత్రం విషయానికి వస్తే..

    రజనీకాంత్‌ కథానాయకుడిగా రూపొందిన ‘లింగ' చిత్రం ఆయన జన్మదినం సందర్భంగా శుక్రవారం అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకుడు. మునిరత్న, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించారు.

    రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘స్వాతంత్య్ర పూర్వ నేపథ్యంలో, ఓ పెద్ద డ్యామ్‌ కట్టడమనే అంశంతో తయారైన సినిమా ఇది. రవికుమార్‌ ఎక్సలెంట్‌గా తీశారు. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తిచెయ్యడం అనేది గొప్ప విషయం. ‘లింగ' అందరికీ నచ్చే, అందరూ మెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు.

    Rajinikanth’s Linga Story Revealed

    నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌గారితో సినిమా చెయ్యడం ఏడేడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునేవిధంగా రవికుమార్‌ దీన్ని అద్భుతంగా రూపొందించారు. మంగళవారం తమిళనాడులో అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించగా, కేవలం రెండు గంటల్లోనే రెండు వారాల వరకు థియేటర్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించాం. ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా ట్రెమండస్‌ హిట్టవుతుందని నమ్ముతున్నా'' అని తెలిపారు.

    'లింగ' కథ చాలా గొప్పదని సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. 'లింగ' చిత్ర సబ్జెక్ట్‌ చాలా పెద్దదని, రైలు పోరాట దృశ్యాలు, బ్రిడ్జ్‌ కట్టే దృశ్యాల్లో వందల మందిని పెట్టి సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. ఈ ఫలితం మొత్తం దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌లకు దక్కుతుందన్నారు. సాబుశిరిల్‌, రత్నవేల్‌, ఏఆర్‌ రెహమాన్‌, అనుష్క, సోనాక్షి సిన్హా లాంటి బిజీ తారలను పెట్టుకుని ఆర్నెల్లో సినిమా తీయడం నిజంగా చాలా కష్టమన్నారు.

    ఈ చిత్ర కథనం తమదేనంటూ నలుగురు కేసు పెట్టారని అయితే ఇది రచయిత పొన్నుకుమారన్‌దే అన్నారు. కథనం అందంగా ఉంటుందన్నారు. కొన్ని పోరాట దృశ్యాలు తాను సొంతంగా చేయలేదని, కానీ హీరోయిన్లతో పాటలన్నీ చేశానని చమత్కరించారు. చాలా కష్టపడి రజనీకాంత్‌ను అందంగా చూపించానని మేకప్‌మేన్‌ అన్నారంటూ చిరునవ్వులు చిందించారు.

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    The most awaited Superstar Rajinikanth’s Lingaa movie is getting ready for a release on the December 12 on the event of the Superstar’s birthday. This Lingaa film will have all the significant elements an average Superstar fan would expect, also being a commercial performer this movie is going to bring a thoughtful and powerful storyline.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X