For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘దర్బార్‌’కు దద్దరిల్లే రెమ్యునరేషన్.. రజనీ ఇండియాలోనే టాప్.. బాలీవుడ్ స్టార్లు కూడా

By Raja
|

పేటా, 2.0 చిత్రాలు భారీ హిట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం దర్బార్. సంక్రాంతి బరిలో దిగుతున్న రజనీకాంత్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్‌కు ముందు పలు విషయాల్లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకొంటుండగా.. తాజాగా రజనీకాంత్ రెమ్యునరేషన్ విషయం మీడియాలో సంచలనం మారింది. కబాలి, కాలా, పేట లాంటి కమర్షియల్ సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రజనీకాంత్ దర్బార్ సినిమా కోసం భారీగానే పారితోషికాన్ని స్వీకరించినట్టు మీడియాలో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. రజనీ ఈ సినిమా కోసం ఎంత తీసుకొన్నాడంటే..

మోషన్ పిక్చర్‌కు భారీ క్రేజ్

మోషన్ పిక్చర్‌కు భారీ క్రేజ్

దర్బార్ మూవీ మోషన్ టీజర్ ఇటీవలే రిలీజై మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్‌లాల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ టీజర్‌లో రజనీకాంత్ స్టయిల్ ఎప్పటిలానే అభిమానులను, ప్రేక్షకులను ఆలరించింది. దీంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

 100 కోట్ల రజనీకాంత్

100 కోట్ల రజనీకాంత్

దర్భార్ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరెక్కించారు. 250 కోట్ల బడ్జెట్‌తో ముంబై నేపథ్యంగా తెరకెక్కిన మాఫియా చిత్రం ఉత్తరాది, దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నాడనే విషయం భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది.

ఇండియాలోనే టాప్

ఇండియాలోనే టాప్

ఇకవేళ రజనీకాంత్ రెమ్యునరేషన్ వార్త నిజమైతే.. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్న హీరో ఎవరైనా ఉన్నారంటే దేశవ్యాప్తంగా కనిపించడం కష్టమే. దేశవ్యాప్తంగా 2.0 వసూలు చేసిన కలెక్షన్ల వల్లే రజనీకాంత్ మార్కెట్ మరింత బలంగా కనిపించిందని, అందుకే లైకా ప్రొడక్షన్ ఆ మొత్తం పారితోషికంగా ఇచ్చినట్టు చెన్నై వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా మూవీగా

ప్యాన్ ఇండియా మూవీగా

దర్బార్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కబాలి, 2.0 చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో ఇప్పుడు దర్బార్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలను బట్టి హిందీలో ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది అని ట్రేడ్ అనలిస్టు జోగిందర్ వెల్లడించారు.

కన్నడలో తెరపైకి కొత్త డిమాండ్

కన్నడలో తెరపైకి కొత్త డిమాండ్

ఇక దర్బార్ రిలీజ్‌కు ముందే కన్నడలో వివాదం మొదలైంది. దర్బార్ చిత్రాన్ని కర్ణాటకలో తమిళంలో విడుదల చేయవద్దనే డిమాండ్ వినిపిస్తున్నది. కన్నడ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని కన్నడ ప్రేక్షకులు కోరుతున్నారు. కన్నడ రంగంలో చాలా ఏళ్ల తర్వాత డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
దర్బార్‌లో రెండు గెటప్స్‌లో

దర్బార్‌లో రెండు గెటప్స్‌లో

ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్ ఈ చిత్రంలో రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరోటి సామాజిక కార్యకర్త. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది. వీరిద్దరి కెమిస్ట్రీ దర్బార్‌కు మేజర్ హైలెట్ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

English summary
South Super star Rajinikanth’s Remuneration for Darbar leaked. Now, He remuneration is top in the Indian market. Report suggest that Rajini has received Rs.100 crores for Darbar.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more