Just In
- 5 min ago
శబ్దం, శాసనం అంటూ బోయపాటి స్టైల్ డైలాగ్‌లు.. మళ్లీ బాలయ్య రచ్చ రచ్చే
- 54 min ago
ఫ్యాన్సీ రేట్‌కు వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు
- 1 hr ago
పోలీసుల ఎన్కౌంటర్ : నేను మరణశిక్షను సమర్థించను.. మంచు లక్ష్మి కామెంట్ వైరల్
- 2 hrs ago
రవితేజ కమ్ బ్యాక్.. కేక పుట్టిస్తోన్న టీజర్
Don't Miss!
- Sports
4లో 2 టెస్టులు పింక్ బాల్‌తో అంటే మరీ టూమచ్: సీఏ ప్రతిపాదనపై గంగూలీ
- News
దిశ నిందితుల ఎన్కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Finance
సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
‘దర్బార్’కు దద్దరిల్లే రెమ్యునరేషన్.. రజనీ ఇండియాలోనే టాప్.. బాలీవుడ్ స్టార్లు కూడా
పేటా, 2.0 చిత్రాలు భారీ హిట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం దర్బార్. సంక్రాంతి బరిలో దిగుతున్న రజనీకాంత్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్‌కు ముందు పలు విషయాల్లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకొంటుండగా.. తాజాగా రజనీకాంత్ రెమ్యునరేషన్ విషయం మీడియాలో సంచలనం మారింది. కబాలి, కాలా, పేట లాంటి కమర్షియల్ సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రజనీకాంత్ దర్బార్ సినిమా కోసం భారీగానే పారితోషికాన్ని స్వీకరించినట్టు మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. రజనీ ఈ సినిమా కోసం ఎంత తీసుకొన్నాడంటే..

మోషన్ పిక్చర్‌కు భారీ క్రేజ్
దర్బార్ మూవీ మోషన్ టీజర్ ఇటీవలే రిలీజై మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్‌లాల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ టీజర్లో రజనీకాంత్ స్టయిల్ ఎప్పటిలానే అభిమానులను, ప్రేక్షకులను ఆలరించింది. దీంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

100 కోట్ల రజనీకాంత్
దర్భార్ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరెక్కించారు. 250 కోట్ల బడ్జెట్‌తో ముంబై నేపథ్యంగా తెరకెక్కిన మాఫియా చిత్రం ఉత్తరాది, దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నాడనే విషయం భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది.

ఇండియాలోనే టాప్
ఇకవేళ రజనీకాంత్ రెమ్యునరేషన్ వార్త నిజమైతే.. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్న హీరో ఎవరైనా ఉన్నారంటే దేశవ్యాప్తంగా కనిపించడం కష్టమే. దేశవ్యాప్తంగా 2.0 వసూలు చేసిన కలెక్షన్ల వల్లే రజనీకాంత్ మార్కెట్ మరింత బలంగా కనిపించిందని, అందుకే లైకా ప్రొడక్షన్ ఆ మొత్తం పారితోషికంగా ఇచ్చినట్టు చెన్నై వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా మూవీగా
దర్బార్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కబాలి, 2.0 చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో ఇప్పుడు దర్బార్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలను బట్టి హిందీలో ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది అని ట్రేడ్ అనలిస్టు జోగిందర్ వెల్లడించారు.

కన్నడలో తెరపైకి కొత్త డిమాండ్
ఇక దర్బార్ రిలీజ్‌కు ముందే కన్నడలో వివాదం మొదలైంది. దర్బార్ చిత్రాన్ని కర్ణాటకలో తమిళంలో విడుదల చేయవద్దనే డిమాండ్ వినిపిస్తున్నది. కన్నడ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని కన్నడ ప్రేక్షకులు కోరుతున్నారు. కన్నడ రంగంలో చాలా ఏళ్ల తర్వాత డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

దర్బార్‌లో రెండు గెటప్స్‌లో
ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్ ఈ చిత్రంలో రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరోటి సామాజిక కార్యకర్త. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్నది. వీరిద్దరి కెమిస్ట్రీ దర్బార్‌కు మేజర్ హైలెట్ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.