వెంకటేష్ 'నాగవల్లి' లో ఆ సూపర్ స్టార్ గెస్ట్ గా....
వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి విడుదల తేది దగ్గరపడుతున్న కొలిదీ చిత్రంలోని విశేషాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడని వినపడుతోంది. అయితే గెస్ట్ గా కొద్ది క్షణాలే కనపడతాడని చెప్తున్నారు. ఇక వెంకటేష్ మాత్రం ఈ విషయమై మాట్లాడుతూ..నాగవల్లిలో రజనీ కనెక్షన్ ఉంది. చంద్రముఖి తరహా సమస్య వచ్చినప్పుడు వెంకీ వెళ్ళతాడా, రజనీ మళ్ళీ వస్తాడా అనే డైలమా చూపెడుతాం. అప్పుడు నేను రజనీతో నాకు ఈ కేసుని ఇన్వస్టిగేట్ చేసే ఓ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటాను. నేను రజనీకాంత్ ని గురువుగా భావించి చెబుతాను అన్నారు. అంటే రజనీ గెస్ట్ గా కనపడితే చెప్తారా లేక ఆయన ఫోటోకు వెంకటేషఅ చెప్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అలాగే చాలా మంది నేను ఈ చిత్రం చేస్తున్నాను అనగానే రజనీకాంతో తో పోల్చి చూస్తారు. అయితే రజనీ మేనరిజంస్ ఏమీ వెంకటేష్ లో కనపడవు. నేను నా స్టైల్ లోనే ఈ పాత్రను చేసాను అన్నారు. ఇక నాగవల్లి చిత్రం డిసెంబర్ 16న విడుదల కానుంది. పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడంలో రూపొందిన ఆప్త రక్షకకు రీమేక్. అలాగే చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ కూడా.


Click it and Unblock the Notifications











