కమల్ హాసన్‌కు రజనీకాంత్ హెచ్చరిక
చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ తన తోటి సినిమా స్టార్ కమల్ హాసన్‍ను హెచ్చరించారా? ఇటీవల కమల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన రజనీకాంత్ పలు విషయాలను చర్చించడంతో పాటు కమల్ తీరు మార్చుకోక పోతే భవిష్యత్‌లో ఏర్పడే సమస్యల గురించి వార్నింగ్ ఇచ్చాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది చెన్నై వర్గాల నుంచి.
కమల్ హాసన్ తన 'విశ్వరూపం' చిత్రం కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. విడుదల విషయంలో ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌కు ఆస్తులను తాకట్టుపెట్టుకుని అప్పులు ఇచ్చిన వారు ఆయన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత కమల్ హాసన్ మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకోవడం, సినిమాను అడ్డుకుంటున్న వారిపై నిప్పులు చెరగడం...చివరకు చేసేది లేక సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడం, తదనంతరం జరిగిన పరిణామాలు విధితమే. విశ్వరూపం భారీ విజయం సాధించి కలెక్షన్స్ కురిపించడంతో కమల్ కష్టాల కడలి నుంచి బయట పడటంతో పాటు, తన ఆస్తులను తిరిగి పొందగలిగాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల కమల్‌ను కలిసిన రజనీకాంత్ ఇకపై ఇలాంటి రిస్కీ ప్రాజెక్టులు చేయ వద్దని, ఆస్తులను వెంటనే ఇద్దరు కూతుర్ల పేరున రాయాలని సూచించాడట. కాదని మొండిగా ఇలానే ముందుకు సాగితే మంచిది కాదని హెచ్చరించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











