రజనీకాంత్, రాజమౌళి మూవీ... పుకార్లు షికార్లు, నిజం ఎంత?
సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి తర్వాతి నుంచి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. అంతకు ముందు ఆరోగ్యం బాగోలేక పోవడంతో సినిమా సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. కబాలి తర్వాత కాలా, 2.0, పేట ఇలా వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తూ వెళుతున్నారు.
తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పేట' జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. అయితే 'పేట' విడుదల తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమాలపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నారు.

నెక్ట్స్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో
రజనీకాంత్ తన తర్వాతి సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్‌గా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజు క్రితమే ఈ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయింది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

కార్తీక్ సుబ్బరాజ్‌కు మరో కమిట్మెంట్ ఇచ్చారా?
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేట' చిత్రం చేసిన రజనీకాంత్... అతడి పనితీరు నచ్చడంతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట. బహుషా ఇది మురుగదాస్ సినిమా తర్వాత ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి పేరు కూడా
అంతే కాదు.... టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో కూడా రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే రాజమౌళి అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట.

నిజా నిజాలు ఎలా ఉన్నా... అభిమానుల్లో ఆనందం
రజనీకాంత్ తర్వాతి సినిమాల విషయంలో వెలువడుతున్న వార్తల్లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే.... సూపర్ స్టార్ వరుస సినిమాలకు కమిటవుతున్నాడనే న్యూస్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. కొన్నేళ్ల క్రితం పరిస్థితి అలా లేదు. 2010లో ‘రోబో' తర్వాత రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ‘లింగా' రావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. లింగా తర్వాత రెండేళ్ల గ్యాపుతో ‘కబాలి' వచ్చింది. అయితే కబాలి విజయం అందించిన ఉత్సాహంతో గడిచిన రెండేళ్లలో 4 సినిమాలు చేశారు సూపర్ స్టలార్. ఈ వరుస సినిమాల పరంపర కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











