కమల్‌ హాసన్‌తో మూవీకి రజనీకాంత్‌కి రికార్డ్ రెమ్యునరేషన్.. దళపతి విజయ్ రికార్డ్‌ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైల్‌కు, స్టార్‌డమ్‌కు నిలువెత్తు రూపం. ఐదు దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతూ.. 76 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు తలైవా. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఆయన సొంతం. పాన్ ఇండియా కల్చర్‌కు ముందే విదేశాల్లోనూ తన సినిమాలను రిలీజ్ చేసిన ఘనత రజనీది. బాక్సాఫీస్ కలెక్షన్స్ అయినా రికార్డులైనా రజనీ దిగనంత వరకే. ఒక్కసారి ఆయన దిగారంటే లెక్కలు మారాల్సిందే. తాజాగా రెమ్యునరేషన్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించారు రజనీకాంత్. ఈ వివరాల్లోకి వెళితే..

46 ఏళ్ల తర్వాత రజనీ- కమల్
లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన ఆణిముత్యాలు కమల్ హాసన్, రజనీకాంత్. ఈ ఇద్దరు దిగ్గజాలు దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు వీరిద్దరూ 21 సినిమాలలో కలిసి నటించారు. అయితే దాదాపు 46 ఏళ్లుగా రజీనీకాంత్ - కమల్ కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ చిత్రం కార్యరూపం దాల్చనుంది. తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజనీకాంత్ నటించబోతున్నారని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించి అంచనాలను పెంచేశారు.

Rajinikanth s Remuneration For Thalaivar 174 x KH238 Super Star Beats Thalapathy Vijay To Set A New Record

రజనీకాంత్ 174వ సినిమా
రజనీకాంత్ కెరీర్‌లో 174వ సినిమాగా, కమల్ హాసన్ కెరీర్‌లో 238వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ ఇద్దరు లెజెండ్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూపించడం ఆషామాషీ విషయం కాదు. భారీ ఫాలోయింగ్‌తో పాటు స్టైల్, నటనకు వీరిద్దరూ కేరాఫ్ అడ్రస్. అలాంటిది వీరిద్దరిని హ్యాండిల్ చేయాలంటే ఎంతో గట్స్ కావాలి. ఈ నేపథ్యంలో పలువరి పేర్లు తెరపైకి వచ్చాయి. లోకేష్ కనగరాజ్‌ పేరు ఎక్కువగా వినిపించగా .. దానిని ఆయన ఖండించారు.

తలైవా 174 నుంచి తప్పుకున్న సుందర్ సి
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సుందర్ సీని దర్శకుడిగా ఎంపిక చేసి షాకిచ్చారు రజనీ- కమల్. అయితే ఈ నిర్ణయం పట్ల ఇద్దరి అభిమానుల నుంచి భారీగా ట్రోలింగ్ జరిగింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న సుందర్ సి దర్శకుడిగా వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో సుందర్ ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దాంతో కమల్ - రజనీ మూవీని టేకప్ చేసే దర్శకుడెవరు? అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? అంటూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ చేతికి తలైవా 174
దీనికి తెరదించుతూ ఈ చిత్ర దర్శకుడిగా స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కన్ఫర్మ్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో జైలర్ 2ను దిలీప్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయాలని నెల్సన్ పట్టుదలగా ఉన్నారు. ఆ తర్వాత తలైవా 174 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఆయన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తలైవా 174 కథేంటీ? రజనీ, కమల్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు బయటకు రావాల్సి ఉంది. తలైవా 174 మూవీని రెడ్ జెయింట్ మూవీస్‌- రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి.

దళపతి రికార్డ్‌ని బద్ధలు కొట్టిన సూపర్‌స్టార్
ఇదిలాఉండగా .. ఈ సినిమాలో రజనీకాంత్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తలైవా 174కి గాను సూపర్‌స్టార్‌ 225 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రజనీకి దాదాపు 225 కోట్ల రూపాయల పారితోషికాన్ని నిర్మాతలు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో దళపతి విజయ్ రికార్డ్‌ను తలైవా బద్ధలు కొట్టారు. కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిన్న మొన్నటి వరకు దళపతి ఉండేవాడు. ఆయన సినీ జీవితంలో ఆఖరి సినిమాగా పరిగణిస్తోన్న జన నాయగన్‌‌కు విజయ్ దాదాపు 220 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ను రజనీకాంత్ బద్ధలుకొట్టి కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌గా నిలిచారు. మరి నిజంగానే రజనీ ఈ రేంజ్‌లో పారితోషికం అందుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X