రజనీ 'రోబో' గురించి షాకిచ్చే నిజాలు
రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ లో కాంబినేషన్ లో రెడీ అయిన రోబో చిత్రం అక్టోబర్ 1 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి రకరకాల విశేషాలు బయిటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ మేకప్ కి చాలా ఖర్చుపెట్టారుట. ఆ ఖర్చు మూడు కోట్లు అని ..దాంతో ఓ మీడియం బడ్జెట్ సినిమా లాగించేయవచ్చనని చెప్పుకుంటున్నారు. అలాగే రజనీకాంత్ ఇప్పటివరకూ ఈ చిత్రం రెమ్యనేషన్ గా ఒక్క సింగిల్ పైసా కూడా తీసుకోకుండా నటించాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం బడ్జెట్ లో నలభై శాతం కేవలం స్పెషల్ ఎఫెక్ట్ కే ఖర్చు పెట్టారు. కళానిధి మారన్ తమిళంలో నిర్మిచిన ఈ చిత్రం బడ్టెట్..రూ.180 కోట్లు. ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింన ఈ చిత్రం తమిళ్, హిందీల్లో ప్రపంచవ్యాప్తంగా 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది.
రోబో శంకర్ రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ కన్నారావు అశ్వనీదత్ robo kanna rao rajinikanth aishwarya rai sivaji


Click it and Unblock the Notifications