'కిక్‌-2' :రెండు కిక్కిచ్చే కొత్త వార్తలు

By Srikanya

హైదరాబాద్ :రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'కిక్‌' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ అదే టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న సినిమా 'కిక్‌-2'. ఈ చిత్రం అనేక విశేషాలతో కిక్కు ఎక్కించనుందని తెలుస్తోంది. ఈ విశేషాలలో మొదటిది రవితేజ డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నాడని, అదీ తండ్రి,కొడుకులుగా అని తెలుస్తోంది. ఆ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అంటున్నారు.

ఇక రెండో విశేషం ఏమిటి అంటారా.. అది ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజపాల్ యాదవ్ కీలక పాత్రలో కనిపించటం. ఆ పాత్ర సినిమాలో పెద్ద హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని రాజపాల్ యాదవ్ ఖరారు చేసాడు.

ప్రస్తుతం భూపాల్...ప్రేయర్ ఫర్ ది రయిన్ చిత్రం ప్రమోషన్ లో ఉన్న రాజపాల్ యాదవ్ ట్వీట్ చేస్తూ... "ఇప్పుడే టాలీవుడ్ లాండ్ లో లాండ్ అయ్యాను..నేను ఒప్పుకున్న తెలుగు చిత్రం కిక్ 2 కోసం ," అన్నారు. ఆయన పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగుతుందని, కొంత ఫన్ కూడిన పాత్ర అదని అంటున్నారు. రాజపాల్ యాదవ్ అంటేనే కామెడీ ..మరి ఈ కామెడీ సినిమాలో ఆయన కామెడీ చేస్తారో లేక తొలి చిత్రంలో లాగ విలనీ చేస్తారో చూడాలి.

Rajpal Yadav in Raviteja's Kick 2

రవితేజ సరసన రకుల్ ప్రీతి సింగ్ ను కిక్ 2 చిత్రం కోసం అడిగినట్లు సమాచారం. అయితే డేట్స్ ఖాళీ లేవని ఆమె తిరస్కరించిందని సమాచారం. దాంతో ఇప్పుడు దర్శక,నిర్మాతలు మరో హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు.

రవితేజ, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ‘కిక్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ చేసిన హంగామా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. ‘కిక్' తరహాలో ఈ సీక్వెల్ కూడా అభిమానులకు వినోదం అందిస్తుందని దర్శకనిర్మాతలు చెప్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశి కథను అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

చిత్ర విశేషాలను నిర్మాత తెలుపుతూ- యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X