Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అందరి కంటే ఎన్టీఆర్ బెస్ట్.. అల్లు అర్జున్ ఆ తర్వాతే.. పవన్ లిస్టులో లేడట..
డ్యాన్సులంటే ముందుగా గుర్తు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్లో ఎందరో హీరోలుకు ఆయన స్ఫూర్తి. ఈ తరం హీరోలో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని డ్యాన్సులతో దుమ్ము దులిపేస్తున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం డ్యాన్సులతో ఇరగదీసే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరిలో ఎవరు గొప్ప అనే చర్చ వచ్చినప్పుడు డిసైడ్ చేయడం చాలా కష్టమే. అయితే ఇదే ప్రశ్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరంను అడిగితే సమాధానం ఏమి వచ్చిందో తెలుసా..
Recommended Video
ఎన్టీఆర్, బన్ని అంటే ఇష్టం
రాజు సుందరం సుదీర్ఘమైన కెరీర్లో ఎందరో హీరోలకు నృత్యాలు సమకూర్చారు. అయితే ఈ తరం హీరోలలో ఎన్టీఆర్, బన్ని అంటే చాలా ఇష్టం. వారు చేసే డ్యాన్సుల్లో గ్రేస్ ఉంటుంది. తెరపైన అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు ఉంటుంది అని రాజు సుందరం చెప్పారు.
అల్లు అర్జున్ ప్రాక్టీస్
డాన్సుల కంపోజ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ అదేపనిగా ప్రాక్టీస్ చేస్తాడు. పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అని రాజు సుందరం తెలిపారు. ఫర్ఫెక్షన్కు అల్లు అర్జున్ ప్రాధాన్యమిస్తాడని పేర్కొన్నారు.
తారక్ అయితే..
తారక్ విషయం మరోలా ఉంటుందట. ప్రాక్టీస్, రిహార్సల్ విషయమే ఉండదట. సెట్స్‌లోనే షాట్ మధ్యలో మూమెంట్స్ చేసి చూపిస్తే అప్పటికప్పుడు ఇరుగదీస్తాడు అని రాజు సుందరం చెప్పారు.
ఎన్టీఆర్ లాంటి వాడిని చూడలేదు. .
ఇప్పటి హీరోలలో ఎన్టీఆర్ లాంటి హీరోను నేను చూడలేదు. ఎన్టీఆర్ డెడికేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అని ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అది జూనియర్ ఎన్టీఆర్ అంటే అని ఆయన అన్నారు.