RRRని మించేలా మరో మల్టీస్టారర్.. బాలీవుడ్ క్రిష్ 4 ప్లాన్?

బాహుబలి అనంతరం బాలీవుడ్ లో గట్టి కదలికలే ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ బడా హీరోలు ఎలాగైనా బాహుబలిని మించిన సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ చేసిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ బాహుబలిని మించిన విజయాన్ని ఆదుకుంటుందని నార్త్ మీడియా గట్టిగానే ప్రచారాలు చేసింది. కానీ ఆ సినిమా అమీర్ కెరీర్ లొనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
RRR పై కన్నేశారు..

RRR పై కన్నేశారు..

బాలీవుడ్ మీడియా గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచుతోంది. ఇక్కడ కూడా వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు దర్శకులు బాగానే ఉన్నారని ఎప్పటికప్పుడు ఇక్కడి విశేషాలని నార్త్ జనాలకు అందజేస్తోంది. ఇక RRR పై బాలీవుడ్ ఇప్పుడు స్పెషల్ గా ఓ కన్నేసి ఉంచింది. ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ అక్కడి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

పోటీగా మరో క్రిష్..

పోటీగా మరో క్రిష్..

RRR రిలీజ్ అనంతరం మినిమామ్ వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల బిజినెస్ చేయగలదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన ఆ కలెక్షన్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. RRR ని మించేలా బాలీవుడ్ లో మరో క్రిష్ ని సిద్ధం చేస్తున్నారట. క్రిష్ చిత్రాల దర్శకుడు రాకేష్ రోషన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ 4 ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు.

క్రిష్ 4.. అంతకుమించి..

క్రిష్ 4.. అంతకుమించి..

2003లో వచ్చిన కోయ్ మిల్ గయా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన క్రిష్ 2 దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ని అందుకుంది. ఆ తరువాత క్రిష్ 3 సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్. ఇండియన్ సూపర్ హీరో సినిమాగా క్రిష్ కూడా ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. హృతిక్ రోషన్ మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. . ఇప్పుడు అంతకు మించి క్రిష్ 4 కోసం రాకేష్ రోషన్ సిద్ధమవుతున్నారు.

మల్టీస్టారర్ అంటున్నారే?

మల్టీస్టారర్ అంటున్నారే?

క్రిష్ 4 ఈ సారి మల్టీస్టారర్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత దర్శకుడు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఫైనల్ కథను సిద్ధం చేసిన రాకేష్ రోషన్ పూర్తి నటీనటులను కూడా ఫిక్స్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ కూడా ఎక్కువగానే ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా RRR సినిమాను మించేలా క్రిష్ 4 పాన్ ఇండియన్ మూవీగా రానున్నట్లు బాలీవుడ్ లో టాక్ వస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X