మెగా నిర్మాణ సంస్ధ నుంచి మంచు లక్ష్మీ ప్రసన్నకు నటిగా ఆఫర్
అనగనగా ఒక ధీరుడు చిత్రతో నటిగా తెలుగు తెరకు పరిచయమైన మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న అంతటా ప్రసంశలు పొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రం ఫెయిల్యూర్ అయినా ఆమెకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.దాంతో రాకేష్ రోషన్ ఈ చిత్రం చూసి ఆమెకు తాము తీయబోయే క్రిష్ సీక్వెల్ లో ఓ కీలకమైన పాత్రను ఆఫర్ చేసాడని తెలుస్తోంది. ఆ చిత్రం కూడా గ్రాఫిక్స్ తో ఉంటుందని, లక్ష్మి విలక్షణంగా కనపిస్తుందని అంటున్నారు. ఇక మొదట ఈ పాత్రకు కంగనా రౌనత్ ని అనుకున్నారు.కానీ ఈ లక్ష్మి ని చూసిన తర్వాత రాకేష్ రోషన్ మనస్సు మార్చుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్ నటించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక లక్ష్మీ ప్రసన్న కూడా అమెరికాలో ధియోటర్ కోర్స్ చేసి, అక్కడ కొన్ని సీరియల్స్ లో చేసి వచ్చిన సంగతి తెలిసిందే.అలాగే లక్ష్మీ ప్రసన్న తొలిసారిగా నిర్మాతగా మారి 'ఝుమ్మంది నాదం' చిత్రం నిర్మించింది.


Click it and Unblock the Notifications











