అదును చూసి చరణ్ పేరు వాడుకున్న ఐటం బాంబ్

ఓ స్పా సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు నిన్న హైదరాబాద్ వచ్చిన రాఖీ...ఈసారి రామ్ చరణ్ పేరును వాడేసుకుంది. ఓపెనింగ్ సందర్భంగా....మీరు సౌత్‌లో ఎక్కువగా లవ్ చేసే మగాడు ఎవరు? అని మీడియా వారు ప్రశ్నించగా....చిరంజీవి సన్ రామ్ చరణ్ అంటూ సమాధానం ఇచ్చింది రాఖీ.
ఓ వైపు రామ్ చరణ్-ఉపాసన పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో....ఈ ప్రకటన ద్వారా మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్రై చేసిన ఈ బ్యాడ్ లేడీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిన్నంతా మీడియా వారంతా ఫోకస్ అంతా చెర్రీ పెళ్లి పైనే పెట్టారు. దీంతో రాఖీ స్టేట్‌మెంటు పెద్దగా ఫోకస్ కాలేదు. దీంతో ఆశించినంత పబ్లిసిటీ రాలేదు ఈ భామకు.
ఐటం బాంబుగా బాలీవుడ్ కెరీర్ ప్రారంభించిన రాఖీ పలు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో....బుల్లితెరపై ప్రవేశించింది, తన మాటలు, చేష్టలు, వివాదాలతో తరచూ మీడియాలో తన పేరు వినిపించేలా జాగ్రత్త పడుతూ ఎంటర్ టైన్మెంట్ రంగంలో తన బిజినెస్ పెంచుకుంటూ వెలుతోంది.


Click it and Unblock the Notifications











