twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేలు కుట్టిన దొంగలా దొరికిన సెక్స్ బాంబ్

    By Srikanya
    |

    సెక్స్ బాంబ్ రాఖీసావంత్ లేటెస్ట్గ్ గా తుపాకి కి సంభందించిన ఓ వివాదంలో ఇరుక్కుని వార్తల కెక్కింది. ఉత్తర్ ప్రదేశ్ లో రీసెంట్ గా పట్టుబడ్డ ఇద్దరు క్రిమినల్స్ దగ్గర ఓ తుపాకీ దొరికింది. అది ఓ ఇటాలియన్ పిస్టల్. దాన్ని ఎక్కడకొన్నారు..ఏమిటీ దాని వివరాలు అని పోలీసులు అడుగుతూంటే..వాళ్ళు ఆ తుపాకీకి మాకు సంభందం ఏమీలేదు. దాన్ని మేం రాఖీ సావంత్ ఇంటిలోంచి కొట్టుకొచ్చాం అని సమాధానమిచ్చి షాక్ ఇచ్చారు. ముంబైలో ఇంతకుముందు రాఖీ సావంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ వివరాలు పోలీస్ స్టేషన్ లో నమోదు అయి ఉన్నాయి. దాంతో వీళ్ళే ఆ దొంగలని నిర్ధారణ కొచ్చి పోలీసులు స్పెషల్ టీమ్ సాయింతో రాఖీ సావంత్ దగ్గరకి వెళ్ళి ఆ తుపాకి గురించి ఎంక్వైరీ చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడు రాఖీ ఆ దొంగలే తన ఇంటిలో దోచుకున్న వాళ్ళు అని ఒప్పుకుంటే ఆ తుపాకి గురించి చెప్పాల్సి ఉంటుంది. లేకుండా ఆ దొంగలు కాదంటే ఆ దొంగిలింపబడ్డ సొత్తుపై ఆశ వదులుకోవాలి. దాంతో రాఖీ సిట్యువేషన్ ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నుయ్యి అనే వచ్చింది.తేలు కుట్టిన దొంగలా..నేనే ఒక పిస్టల్ ని, ఇంకా వేరే పిస్టల్ ఎందుకు అనంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X