అతనో ఇడియట్ అన్న ఇడియట్ హీరోయిన్...!?
పూరి జగన్నాథ్ 'ఇడియట్"తో పరిచయమైన రక్షిత ఆ సినిమా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చెయ్యలేదనే చెప్పాలి. చేసిన ఒకటి అరా ఆమెకు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు. దీంతో చేసేది లేక కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన రక్షిత అక్కడ్ ప్రేమ్ అనే దర్శకుడి చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆ సమయంలో అతనితో ప్రేమలో పడి పెళ్ళి కూడా చేసేసుకుంది. ఇప్పుడా పెళ్ళి పెటాకులయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడతను తాజాగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని తెలిసి తనకీ మొగుడు వద్దు అని కోర్టుకెక్కింది. అతనితో కలిసి జీవించడం ఇక సాధ్యం కాదని చెప్తోంది. పెద్ద వాళ్ళు ఎంత నచ్చజెప్పినా అదే తన నిర్ణయం అంటోంది రక్షిత.


Click it and Unblock the Notifications











