‘రక్త చరిత్ర పార్ట్2’ తర్వాత మద్దెలచెరువు సూరి ఇంటికి గజని సూర్య..!?

By Sindhu

రక్త చరిత్ర సినిమా ఎంతటి సంచలనం సష్టించిందో అందరికి తెలిసిందే. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చిత్రం 'రక్తచరిత్ర'. రామ్‌ గోపాల్‌ వర్మ ఈ కథని రెండు భాగాలుగా చిత్రించారు. వివేక్‌ ఒబెరాయ్‌, సూర్య ప్రధాన పాత్రధారులు. తొలి చిత్రం గత వారమే తెర మీదకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌ ని పోలిన పాత్రను కించపరచేలా చూపించారనే వివాదం రావడంతో ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నట్లు సమర్పకుడు సి.కల్యాణ్‌ ప్రకటించారు.

'రక్త చరిత్ర 2'ని వచ్చే నెల 19న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ భాగంలో సూర్య పాత్ర ప్రవేశిస్తుంది. మొదటి భాగంలో నరసింహారెడ్డిని ప్రతాప్‌ రవి (వివేక్‌) హత్య చేస్తాడు. తదనంతరం నాయకుడిగా ఎదుగుతాడు. ఇందులో నరసింహారెడ్డి కుమారుడు ఇంకా రాలేదు. ద్వితీయ భాగంలో అతని పాత్ర ఉంటుంది. ఆ పాత్రలోనే తమిళ హీరో (గజిని) సూర్య నటించారు. అతని భార్యగా ప్రియమణి కనిపిస్తుంది. రక్తచరిత్ర పార్ట్ 2 విడుదల తర్వాత హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారు. రక్త చరిత్ర పార్ట్ 1 విడుదల అనంతరం పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ పరిటాల సునీత ఇంటికి వెళ్ళి బోజనం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల అనంతరం హీరో సూర్య మద్దెల చెరువు సూరి ఇంటికి వెళ్ళి భోజనం చేయనున్నారా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X