twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అవమానంతోనే 'రక్తచరిత్ర'ను తెలుగులో బ్యాన్ చెయాలంటున్నారు...!?

    By Sindhu
    |

    ప్రారంభం నుంచి ఎన్నో వివాదలను సృష్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర" చిత్రాన్ని తెలుగులో బ్యాన్ చెయ్యాలని టాలీవుడ్ భావిస్తోంది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లో టాలీవుడ్ కి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు నిర్మాతలు, నటులు ఫిల్మ్ ఛాంబర్ ని ఆశ్రయించి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చెయ్యాలని కోరుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య జరిగిన ఆడియో ఫంక్షన్ కు చిత్రంలో నటించిన నటీనటులను గానీ, టెక్నీషయన్స్ ని గానీ ఆహ్వానించలేదు.

    జరిగినది ఆడియో ఫంక్షన్ అయినా సంగీత దర్శకుడ్ని కూడా పిలవలేదు. కనీసం ఫంక్షన్ లో పెట్టిన వినైల్ లో కూడా మ్యూజిక్ డైరెరక్టర్ పేరు లేదు. ఈ విషయాన్ని వర్మ దగ్గర ప్రస్తావించగా సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు అనవసరం అన్నాడు. కానీ, తమిళ్ ఆడియో ఫంక్షన్ కి యూనిట్ మొత్తం హాజరైంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దీన్ని బట్టి తెలుగు ఇండస్ట్రీ అంటే వర్మకు ఎంత చిన్నచూపు వుందో అర్థమవుతోంది. ఏది ఏమైనా తను చేసే ప్రతి పనిలోనూ కాంట్రవర్సీని ఎలా క్రియేట్ చెయ్యాలా అని ఆలోచించే వర్మకి పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టుకుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X