twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'కు కొత్త తలనొప్పి

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రం ముంబైలోని ఫైటర్స్ అశోషియేషన్ వల్ల కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. బై లింగ్వల్ (ద్వి భాషా) చిత్రాలకు రెట్టింపు పారితోషికం డిమాండ్ చేస్తున్న అశోషియేషన్ వారు రక్త చరిత్ర త్రి భాషా(తెలుగు,హిందీ,తమిళ్) చిత్రం కాబట్టి మూడు రెట్లు పేమెంట్ చెయ్యాలని చెప్తున్నారు. ఈ విషయంపై నిర్మాత శీతల్ తల్వార్ స్పందిస్తూ...ఈ గొడవ జరుగుతున్న మాట నిజమే..వాళ్ళు మూడు రెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.దానికి రీసెంట్ ఉదాహరణగా మణిరత్నం రావణ్ చిత్రాన్ని చూపెడుతున్నారు. అయితే రావణ్ చిత్రం రెండు భాషలకూ విడివిడిగా చిత్రీకరించారు. కానీ మేం ఒకే వెర్షన్ ని తీసి మూడు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. కేవలం కొన్ని క్లోజప్ లు మాత్రమే ఈ వెర్షన్ లలో తేడా ఉంటుంది.హిందీలో ఏ స్టార్ కాస్ట్ వాడతున్నామో,వాళ్ళనే అదే షాట్స్ తో మిగతా లాంగ్వేజెస్ లో ఉపయోగిస్తున్నాం..అలాంటప్పుడు ఎలా పే చెయ్యగలుగుతాం అని ఆయన స్పందించారు.

    ఓ వారం నుంచీ ఫైటర్స్ అశోషియేషన్ వారు ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. అయితే రక్త చరిత్ర నిర్మాతలు మాత్రం డిమాండ్ చేసిన ఆ ఎమౌంట్ ని ఇవ్వటానికి రెడీగా లేమని తేల్చేస్తున్నారు. అలా చేస్తే మరో యాభై అవరై లక్షలు దాకా ఎగస్ట్రా బర్డెన్ అవుతుందని చెప్తున్నారు. మేం కూడా అదే విషయాన్ని కన్విన్స్ చేసి పరిస్ధితిని చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నాం..చూద్దాం ఏం జరగనుందో అంటున్నారు నిర్మాత తల్వార్.'రక్త చరిత్ర'పస్ట్ ఫార్ట్ రిలీజ్ ఆగస్టు 11న అవనుంది. మొదటి పార్ట్ రిలీజైన రెండు వారాల తర్వాత పార్ట్‌-2 రిలీజవుతుంది. ఇందులో పరిటాల రవిగా వివేక్‌ ఓబరాయ్‌, సూరిగా సూర్య చేశారు. ఈ సినిమా కోసం పరిటాల రవి సన్నిహితులను, సూరిని కలుసుకుని వివరాలు సేకరించాను అన్నారు. సూరి భార్య భానుమతి కేరక్టర్‌ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X