పండుగ: పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చింది

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటమంటే దర్శకులకు ఉత్సాహం...నిర్మాతలకు ఆనందం...అదే హీరోయిన్స్ కి అయితే చెప్పేనక్కర్లేదు...తమ కెరీర్ మలుపు తిరుగుతుందని మురిసిపోతూంటారు. ఇప్పుడు అలాంటి సంతోషంలోనే రకుల్ ప్రీతి సింగ్ ఉందని సమాచారం. ఆమెకు పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించటానికి పిలుపు వచ్చిందని సమాచారం. బాబి దర్శకత్వంలో రూపొందనున్న గబ్బర్ సింగ్ 2 లో హీరోయిన్ గా ఆమెను అడిగారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా వినికిడి.

ఇక ఇప్పటికే అనీష అంబ్రోస్ ని ఆల్రెడీ ఓ హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇంకో హీరోయిన్ గా ఆమెను అడిగారని చెప్తున్నారు. దాంతో రకుల్ పండుగ చేసుకుంటోందని చెప్తున్నారు. తెలుగునాట దూసుకొస్తోన్న యంగ్ హీరోయిన్ రకుల్‌. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'లౌక్యం', 'కరెంట్‌తీగ'తో ప్రేక్షకుల్ని మెప్పించింది. మరో మూడు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

Rakul gets a call from Pawan Kalyan!

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

గబ్బర్ సింగ్ 2 విషయానికి వస్తే...

పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన తిక్కేంటో, ఆ తిక్కకున్న లెక్కేంటో చూపించబోతున్నాడు. 'గబ్బర్‌ సింగ్‌'తో అభిమానుల్ని అలరించిన పవన్‌ ఇప్పుడు అంతకు రెట్టింపు వినోదాలు పంచిపెట్టబోతున్నాడు. ఔను 'గబ్బర్‌సింగ్‌ 2' త్వరలో పట్టాలెక్కబోతోంది. చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. 'పవర్‌'తో ఆకట్టుకొన్న కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తారు.

హీరోయిన్ గా అనీషా అంబ్రోస్‌ను ఎంచుకొన్నారు. 'అలియాస్‌ జానకి'తో తెరపై సందడి చేసింది అనీషా. ఆ సినిమా సరిగా ఆడకపోయినా 'గబ్బర్‌సింగ్‌ 2'లో అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌మరార్‌ నిర్మాత.

వచ్చే నెలలో 'గబ్బర్‌సింగ్‌2' సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్‌గానీ, ప్రీక్వెల్‌గానీ కాదట. బాలీవుడ్‌ 'దబాంగ్‌'కీ ఎలాంటి సంబంధం లేదట. యాక్షన్‌, వినోదం మేళవించిన కథ పవన్‌ రాసుకొన్నారని చిత్రబృందం చెబుతోంది. బ్రహ్మానందం, అలీతో పాటు 'గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి గ్యాంగ్‌' వినోదాలు పంచబోతోంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌.

'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్‌ సింగ్‌గా పవన్‌ కల్యాణ్‌ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. శరత్‌ మరార్‌ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X