రకుల్ కు అది కూడా వచ్చు.....కాస్త జాగ్రత్తగా ఉండండి

By Srikanya

హైదరాబాద్ : అసలు హడావిడి లేకుండా...పెద్ద ప్రమోషన్ సైతం లేకుండా...చిన్న సినిమాతో చడీచప్పుడు లేకుండా ప్రయాణం మొదలుపెట్టింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇప్పుడేమో వరుసగా అవకాశాలు అందుకొంటూ దూసుకెళుతోంది. ఈ డిల్లీ భామట... రోజూ కిక్ భాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే గ్యాప్ ఇస్తోందిట. అలాగే నిపుణుల సారధ్యంలో ఈ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తోంది.

రకుల్ మాట్లాడుతూ.."నేను నా వర్కవుట్స్ ఎప్పుడూ మిస్ అవ్వటానికి ఇష్టపడను. అవి మానేస్తే మూడీగా ఉంటుంది. నేను ఫుడ్ సప్లిమెంట్స్ ఏమీ తీసుకోకుండా ఇంటి ఫుడ్ నే తింటాను.. పళ్లు..ఉడికించిన ఆహారం, పచ్చి కూరగాయాలు ప్రిఫర్ చేస్తాను..జంక్ ఫుడ్స్ ని సాధ్యమనైనంత వరకూ ఎవాయిడ్ చేస్తాను ", అంటూ తన ఫిటినెస్ రహస్యం వివరించింది.

మరి పార్టీలుకు,ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు పరిస్ధితి ఏమిటీ అంటే.. "తిన్నదానికి రెట్టింపు వ్యాయామం చేస్తాను..ఇసు బస్తాలతో కిక్ భాక్సింగ్ ని కంటిన్యూగా చేస్తాను.. అదే నన్ను ఫిట్గా ఉంచుతోంది.. దాంతో నేను ఏం తిన్నా ఫర్వాలేదు" అంటూ చెప్పుకొచ్చింది.

Rakul Preet's Kickboxing In Hyderabad

తొలి చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విజయం సాధించడం, అందులో రకుల్‌ కనిపించిన విధానం కుర్రకారుకు నచ్చడం, కమర్షియల్‌ కథానాయికకి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయని పరిశ్రమ గుర్తించడం వంటి కారణాలతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిర్మాతలు అవకాశాలతో వరుస కట్టేశారు. అందుకే ఇప్పుడు రకుల్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.

తక్కువ వ్యవధిలోనే ఇంతటి బిజీ హీరోయిన్ అయిపోవడం ఎలా అనిపిస్తోంది? అని అడిగితే ''చిత్ర పరిశ్రమ గురించి నాకు ముందు నుంచీ అవగాహన ఉంది. ఇక్కడ నాకు తెలిసినవాళ్లు ఎవ్వరూ లేకపోయినప్పటికీ నాకు నేనుగా పనిగట్టుకొని పరిశ్రమ గురించి తెలుసుకొనేదాన్ని. ప్రయాణం మలుపు తిరగడానికి ఒక్క సినిమా చాలు అని నాకు తెలుసు.

అందుకే ఎలాగైనా తొలి అడుగుల్లోనే విజయం సొంతం చేసుకోవాలనుకొన్నా. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇక్కడ విజయం సొంతం చేసుకోవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే కీలకం. ఇప్పుడు ఆ విషయంపైనే నా దృష్టంతా. సాధ్యమైనంత వరకు ఎక్కడా తప్పులు చేయకుండా జాగ్రత్తపడుతున్నా'' అని చెప్పుకొచ్చింది రకుల్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X